Posts

Showing posts from May, 2026

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

Image
కాకినాడ : సత్య చారిటబుల్ ట్రస్ట్, సత్య స్కాన్స్ అండ్ డయాగ్నస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం జూన్ 7న స్కాలర్‌షిప్ మెరిట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాదా వెంకటరమణ తెలిపారు. పదో తరగతిలో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, పరీక్ష కేంద్రాల వివరాలను పరీక్షకు రెండు రోజుల ముందు విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. మొత్తం 60 బహుళ ఎంపిక ప్రశ్నలతో 140 మార్కులకు పరీక్ష ఉంటుందని వివరించారు. గణితంలో 20 ప్రశ్నలకు 40 మార్కులు, సైన్స్‌లో 20 ప్రశ్నలకు 40 మార్కులు, సాంఘిక శాస్త్రం మరియు సాధారణ జ్ఞానంలో 20 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయించినట్లు తెలిపారు. పరీక్ష 10వ తరగతి సిలబస్‌తో పాటు సాధారణ జ్ఞానం ఆధారంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ముఖ్యమైన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవడంతో పాటు సమకాలీన అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప...

ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

Image
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని ట్రిపుల్ ఐటీ (IIIT)లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును అధికారులు రేపటి వరకు పొడిగించారు. రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉండగా, ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) కోటా కింద అదనంగా 10 శాతం సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వచ్చే నెల రెండో వారంలో ప్రవేశ ఫలితాలను విడుదల చేసి, మూడు నుంచి నాలుగు వారాల వ్యవధిలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తిరుపతిలో ఎన్ఆర్ఐకి షాక్.. హోటల్ లాకర్‌లోని 1000 డాలర్లు మాయం

Image
తిరుపతి  : తిరుమల శ్రీవారి దర్శనానికి సింగపూర్ నుంచి కుటుంబంతో వచ్చిన ఓ ఎన్నారైకి తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారాసా సరోవరం హోటల్‌లోని రూమ్ నెంబర్ 1017లో బస చేసిన ఆర్ముగం కుటుంబం, శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి చూడగా లాకర్‌లో ఉంచిన 1000 అమెరికన్ డాలర్లు కనిపించలేదు. దీంతో బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నంబర్ 191/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసును అలిపిరి ఎస్‌ఐ దుర్గాప్రసాద్ విచారిస్తున్నారు.

అనపాల ఆంజనేయులు రెడ్డిని అభినందించిన సానా సతీష్ బాబు

Image
కాకినాడ :  సమాజ సేవను బాధ్యతగా భావిస్తూ సంవత్సరం పొడవునా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనపాల ఆంజనేయులు రెడ్డిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అభినందించారు. మండుటెండల్లో ప్రజలకు, పేదలకు, పాదచారులకు చల్లని తాగునీరు అందించడంతో పాటు మూగజీవాలైన పశువులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేకంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తూ విద్యకు ప్రోత్సాహం అందించడం ద్వారా సమాజంలో సేవా భావాన్ని చాటుతున్నారని కొనియాడారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు దూరంగా నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆంజనేయులు రెడ్డి సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని సానా సతీష్ బాబు అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువై సామాజిక కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

పుష్కరాలపై పవన్ ఫోకస్.. గోదావరిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దే మహాయజ్ఞం.. 268 పంచాయతీల్లో ప్రత్యేక ప్రణాళిక

Image
ఆంధ్రప్రదేశ్ : పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గోదావరి పుష్కరాల నిర్వహణలో చెత్త, కాలుష్య నియంత్రణకు నిపుణుల సూచనలు వినియోగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు ఉత్పత్తి అవుతున్న 7,200 టన్నుల పొడి చెత్తను సమర్థంగా వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన అవసరాలను తీర్చవచ్చని పేర్కొన్నారు. పుష్కరాలకు సంబంధించిన 268 పంచాయతీల్లో ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించి చెత్త నిర్వహణపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. చెత్తను వేరు చేసే విధానంలో గ్రామాల నుంచి నగరాల వరకు మార్పు తీసుకురావాలని, డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో మరో ఆరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, కాకినాడలో ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఇండోర్ నగర చెత్త నిర్వహణ విధానం ఆదర్శమని పేర్కొంటూ, చెత్తను సంపదగా మార్చే విధానాలతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

సముద్ర తాబేళ్ల సంరక్షణకు ‘టెడ్’ పరికరాలు కీలకం – ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ

Image
కాకినాడ : సముద్ర జీవవైవిధ్య పరిరక్షణతో పాటు మత్స్య సంపద పెంపుదలకు టర్టిల్ ఎక్స్‌క్లూడర్ పరికరాలు (టెడ్) ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడలోని రాష్ట్ర మత్స్య సాంకేతిక శిక్షణ, పరిశోధన సంస్థలో శనివారం యాంత్రిక పడవల యజమానులకు టర్టిల్ ఎక్స్‌క్లూడర్ పరికరాలపై శిక్షణ, పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మత్స్యకారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ సుస్థిరమైన, బాధ్యతాయుతమైన చేపల వేటను ప్రోత్సహించాలని సూచించారు. ట్రాలింగ్ చేపట్టే పడవలకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా టెడ్ పరికరాలను అమర్చుకోవాలని, దీనివల్ల సముద్ర తాబేళ్ల రక్షణతో పాటు సముద్ర పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని తెలిపారు. పర్యావరణహితమైన వేట విధానాలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు సమృద్ధిగా మత్స్య సంపద అందుబాటులో ఉంటుందన్నారు. ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా ఈ పరికరాలను అందిస్తోందని, మత్స్యకారులు వాటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వి. కృష్ణారావు మాట్లాడుతూ యాంత్రిక పడవలకు టెడ్ పరికరాలు అమర్చడం తప్...

ఉపాధి సృష్టికి పరిశ్రమలే శక్తి.. యువతకు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పిలుపు

Image
కాకినాడ : రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ సహకారంతో, పనిముట్ల రూపకల్పన కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపార సంస్థల అభివృద్ధి అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలకు వ్యాపార విస్తరణ అవకాశాలు, ఉత్పత్తుల నాణ్యత మెరుగుదల, మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై సమగ్ర అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కొత్త పరిశ్రమలను స్థాపించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె సూచించారు. చిన్న పరిశ్రమలు బలమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివని, సాధికారత పొందిన పారిశ్రామికవేత్తలే సుసంపన్న సమాజ నిర్మాణానికి పునాది వేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

క్రీడలతో యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందుతుంది: ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ

Image
కాకినాడ :  విద్యార్థులు, యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. ప్లే యాక్సెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక లేడీస్ క్లబ్ ప్రాంగణంలోని ఇందిరా సుబ్బిరామిరెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల బ్యాడ్మింటన్ పోటీలను శుక్రవారం ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువత చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా పోటీ తత్వాన్ని, ఓర్పును, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని పెంచుతాయని తెలిపారు. మూడు రోజుల పాటు నాకౌట్ విధానంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరమన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు కాకినాడలో నిర్వహించడం ద్వారా స్థానిక క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన ...

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

Image
అమరావతి : ఒడిశా వైపు నుంచి శ్రీకాకుళం జిల్లాను తాకిన ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ వ్యవస్థ సముద్రంలో మరింత బలపడిన నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలపై హెచ్చరికలు జారీ చేశాయి.  ఈ అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెల్లవారుజామున నెల్లూరు, తిరుపతి సహా దక్షిణ కోస్తా జిల్లాలకు వర్షాలు విస్తరించే అవకాశముందని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల పరిస్థితులు నమోదవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.  ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, మత్స్యకారులు సముద్ర పరిస్థితులపై అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. 

ఈ కోడిని వేటాడితే మూడేళ్ల జైలు

Image
  భారతదేశం  : అడవుల్లో కనిపించే గ్రే జంగిల్ ఫౌల్ (అడవి కోడి)ను వేటాడటం, విక్రయించడం లేదా ఆహారంగా వినియోగించడం చట్టరీత్యా నేరమని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మన దేశానికి ప్రత్యేకమైన ఈ అరుదైన పక్షి వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో రక్షణ పొందుతోంది. గింజలు, కీటకాలు, చిన్న జీవులను ఆహారంగా తీసుకునే ఈ పక్షులు అడవుల పర్యావరణ సమతుల్యతకు కీలకంగా ఉపయోగపడతాయి. ప్రమాదం ఉందని గుర్తిస్తే వెంటనే చెట్లపైకి ఎగిరి రక్షణ పొందడం వీటి ప్రత్యేకత. ఈ పక్షులను వేటాడినట్లు లేదా మాంసం విక్రయించినట్లు తేలితే నిందితులకు జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, అడవి జంతువులు, పక్షుల వేటపై సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని సూచిస్తున్నారు.

వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.70 లక్షల ఆస్తినష్టం

రాజమహేంద్రవరం  : నగరంలోని కోటగుమ్మం సెంటర్ సమీపంలో ఉన్న ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణంలోని రెండు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే దుకాణంలో నిల్వ ఉంచిన పెద్ద మొత్తంలో వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, సుమారు రూ.70 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు దుకాణ యజమాని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి కేసులో దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి: ఏఐటీయూసీ

Image
కాకినాడ : మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మార్చి 6న మహిళా సెక్యూరిటీ గార్డులపై జరిగిన దాడి ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి జరగడం సిగ్గుచేటని, బాధ్యులపై వెంటనే చార్జిషీట్ దాఖలు చేసి అరెస్టు చేయాలని ఆయన కోరారు. దాడి ఘటనలో ఆర్ఎంసీలో పనిచేస్తున్న శివగంగ, ఆమె కుమారుడు మరియు బయటి నుంచి వచ్చిన వ్యక్తుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చార్జిషీట్‌లో ఉన్న శివగంగను రంగరాయ మెడికల్ కళాశాల విధుల నుంచి తొలగించాలని కూడా కోరారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి రోజూ వేలాది మంది పేద ప్రజలు వైద్య సేవల కోసం వస్తుంటారని, అలాంటి ప్రశాంత వాతావరణంలో మహిళా సిబ్బందిపై దాడులు ...

మహానాడు కాదు దగానాడు.. జమ్మలమడక నాగమణి ధ్వజం

Image
కాకినాడ రూరల్ : తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ఆత్మస్తుతి, పరనిందలకే పరిమితమైందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మహానాడులో ప్రజా సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి అంశాలపై చర్చ జరగకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై చర్చించాల్సిన వేదికను చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ భజన సభగా మార్చారని వ్యాఖ్యానించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన మహిళా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, పింఛన్ల పంపిణీ వంటి అంశాలను గుర్తు చేసిన నాగమణి, ప్రస్తుత ప్రభుత్వం ఆ హామీలను ఎందుకు నిలిపివేసిందో ప్రజలకు సమాధానం చెప్పలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేసి చరిత్ర సృష్టించిన జగన్ చిత్తశుద్ధిని గుర్తు చేస్తూ, చంద్రబాబు కూడా రాజ్యసభ, కేబినెట్‌లో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో జరిగిన అవకతవకలపై, యువతకు జరిగిన అన్యాయంపై మహానాడులో ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. విద్...

న్యాయం కోరితే హౌస్ అరెస్ట్ చేయడం దారుణం: వాసంశెట్టి రాజేశ్వరరావు

Image
కాకినాడ  : న్యాయం చేయాలని అడిగిన వారిని హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నూకాలమ్మ గుడి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన పిల్లి నానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆసుపత్రి వద్దకు వెళ్లేందుకు సంఘం పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇంద్రపాలెంలోని తన నివాసంలో మాట్లాడుతూ, ఆసుపత్రికి బయలుదేరిన సమయంలో పోలీసులు వచ్చి తనను హౌస్ అరెస్ట్ చేయడం తగదన్నారు. మృతుడు పిల్లి నానికి ఇద్దరు చిన్నపిల్లలు ఉండగా, భార్య గర్భిణిగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బీసీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వారినే అణగదొక్కుతున్నాయని వాసంశెట్టి అసహనం వ్యక్తం చేశారు. తమను ఆసుపత్రి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లి నాని కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వం పరంగా తగిన సహాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్...

మహానాడులో ప్రజా సమస్యలపై చర్చలు ఎక్కడ? ఆత్మస్తుతి, ప్రతిపక్ష విమర్శలకే పరిమితమైందని సీపీఐ నేత తాటిపాక మధు విమర్శ

Image
కాకినాడ జిల్లా : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికలో ఆత్మస్తుతి, ప్రతిపక్షాలపై విమర్శలు తప్ప ప్రజలకు ఉపయోగపడే అర్థవంతమైన చర్చలు జరగలేదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కీలక అంశాలపై ఎలాంటి చర్చలు, చర్యలు, సూచనలు, తీర్మానాలు కనిపించలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే కేజీ బేసిన్ చమురు నిక్షేపాలు, యువత ఉపాధి, కార్మిక సమస్యలు వంటి అంశాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మహానాడులో రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రజలు ఆశించారని, అయితే ఆ స్థాయి చర్చలు జరగలేదన్నారు.రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధనపై బలమైన తీర్మానం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన రోడ్‌మ్యాప్ కనిపించలేదని, నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగ భ...

డీఎస్సీ అక్రమాలపై ఎస్వీయూ దగ్గర వైఎస్సార్ విద్యార్థి విభాగం నిరసన. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్.

Image
తిరుపతి : డీఎస్సీ-2026లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. దగా డీఎస్సీని వెంటనే రద్దు చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఓసీ ఓపెన్ కటాఫ్ ప్రకటించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం చేశారని విమర్శించారు. మెరిట్‌లో వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కోటాలో మ...

అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Image
Andhra Pradesh :  YSR Kadapa district గోపవరం మండలం పీపీ కుంట సమీప అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, స్థానికులు మరియు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్సుల ద్వారా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కొత్తపేటలో సుడిగాలి బీభత్సం 🌪️ భారీ చెట్టు కూలి యువకుడికి తీవ్ర గాయాలు

  కొత్తపేట నియోజకవర్గంలోని పలివెల – కొత్తపాలెం రహదారిపై బలమైన ఈదురుగాలులకు భారీ వృక్షం కూలిపోయింది. అదే సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కొత్తపాలెంకు చెందిన కుడిపూడి వెంకటేష్ బాబు చెట్టు కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మూడు క్లస్టర్లలో మహానాడు విజయవంతం.. బాబీని సత్కరించిన టిడిపి నేతలు

Image
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కరప మండలంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని మూడు క్లస్టర్ల పరిధిలో సమన్వయంతో విజయవంతంగా నిర్వహించి పార్టీ శ్రేణుల ప్రశంసలు అందుకున్నారు. మహానాడు నిర్వహణలో బాబి చూపించిన వ్యూహరచన, నాయకత్వం, కార్యకర్తల సమీకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు గండి వెంకటేశ్వరరావు వేదికపైనే బాబిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. “పార్టీ బలోపేతానికి బాబి చేస్తున్న కృషి అభినందనీయం. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కార్యాచరణ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి” అని కొనియాడారు. సీనియర్ నాయకులను గౌరవిస్తూ, కార్యకర్తలను కలుపుకుని ముందుకు తీసుకెళ్తున్న బాబి తీరు ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బుంగా సింహాద్రి, క్లస్టర్ ఇంచార్జ్ గండి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుల...

కాకినాడలో కే టాక్స్ మాఫియా : వైసీపీ సంచలన ఆరోపణలు

Image
కాకినాడ : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడ నగరంలో “కే టాక్స్” పేరుతో టీడీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే చిన్న క్రీడా మైదానం చదును పనులకు సంబంధించిన రూ.93 లక్షల టెండర్‌లో రూ.50 లక్షల వరకు గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. గురువారం నగరంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలు ఈ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు మళ్ళా కిషోర్ మాట్లాడుతూ నగరంలో మద్యం దుకాణాలు, ఆశీలు పాటలు, రేషన్ బియ్యం కొనుగోలు, జూదం నంబర్ ఆటలు, సర్కు రవాణా బార్జీల పునరుద్ధరణల పేరుతో అదనపు వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతి మద్యం సీసాపై అదనంగా పది రూపాయలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమ వసూళ్ల ద్వారా ప్రతి నెల భారీ మొత్తంలో అవినీతి సొమ్ము చేరుతోందని విమర్శించారు. జగన్నాధపురంలోని ఎంఎస్ఎన్ సేవా సంస్థల క్రీడా మైదానాన్ని తమ హయాంలో ఉచితంగా చదును చేశామని, ప్రస్తుతం అదే పనికి టెండర్ పిలిచి భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదా...

వరుస చోరీల వెనుక అసలు వ్యక్తి అరెస్ట్.. బంగారం, నగదు స్వాధీనం

Image
కాకినాడ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న ములపార్తి దుర్గప్రసాద్‌ను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంతో పాటు పలు ప్రాంతాల్లో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడిన నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.32 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ వివరాలను ఎస్‌డీపీఓ పాటిల్ దేవరాజ్ మనీష్ వెల్లడించారు. కార్యక్రమంలో సర్పవరం సీఐ ప్రకాష్, క్రైమ్ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి ఘటనలో దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి: ఏఐటీయూసీ

Image
కాకినాడ : కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ విమర్శించారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధ సంఘం) ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) ప్రధాన ద్వారం వద్ద మహిళా సెక్యూరిటీ గార్డులపై జరిగిన దాడికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు, సెక్యూరిటీ గార్డులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ మార్చి 6న జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. బాధితులపై దాడి చేసిన వారిని అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, వారి భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఘటన జరిగిన మూడు నెలలు గడిచినా ఆసుపత్రి యాజమాన్యం, సంబంధిత అధికారులు, ...

ఎన్టీఆర్ ఆశయాలే రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి : కటకంశెట్టి బాబి

Image
  కాకినాడ రూరల్ :  తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశయాలతోనే రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాకినాడ రూరల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు రెండో రోజు వేడుకలు కాకినాడ రూరల్ క్లస్టర్ ఇన్‌చార్జ్-4 పేరాబత్తుల లొవబాబు ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న సహకార శ్రీ నిలయం కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్ని కృష్ణ, కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) ముఖ్య అతిథులుగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని కొనియాడారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, ప్రాంతీయ ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పుట్టుకే తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం జరిగిందని తెలిపారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజల...

కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్.. అభిమానులకు స్టేడియం అనుభూతి

Image
  కాకినాడ : టాటా ఐపీఎల్-2026 ఫ్యాన్ పార్క్స్ ద్వారా క్రికెట్ అభిమానులకు స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని అందిస్తున్నామని బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ అధికారి అనంత దత్త తెలిపారు. కాకినాడలోని కృషి భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐపీఎల్‌ను మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 29, 31 తేదీల్లో జిల్లా క్రీడా మైదానంలో ఫ్యాన్ పార్క్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లపై మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలతో పాటు సంగీత కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని 50 నగరాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కాకినాడ అభిమానులకు పూర్తి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

మెగా డీఎస్సీపై విష ప్రచారం మానుకోండి.. వైఎస్సార్‌సీపీకి సుంకర పావని హెచ్చరిక

Image
కాకినాడ సిటీ: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్ విమర్శించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా సక్రమంగా ఇవ్వలేదని, నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర జగన్‌దేనని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తి చేస్తోందని తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షల్లో ఎలాంటి పేపర్ లీకేజీలు లేదా అక్రమాలు జరగలేదని, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అభ్యర్థుల డేటా డిలీట్ అయిందనడం గందరగోళం సృష్టించే కుట్ర మాత్రమేనని విమర్శించారు. ఎస్‌సీఈఆర్టీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారం కూడా దుష్ప్రచారమేనని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం కల్పించామని తెలిపారు. అభ్యర్థుల మెరిట్ మార్కులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు డ...

జూన్ 5న పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష

Image
బక్రీద్ సెలవుతో పదో తరగతి ఆంగ్ల పరీక్ష వాయిదా  కాకినాడ :   నేడు నిర్వహించాల్సిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఆంగ్ల భాష సబ్జెక్టు పరీక్షను జూన్ 5వ తేదీకి వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. బక్రీద్ సెలవు నేపథ్యంలో ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించడంతో పరీక్ష తేదీని మార్చినట్లు వెల్లడించారు.

అత్యవసర వైద్య సేవలపై మెడికవర్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం

Image
కాకినాడ : ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ కృష్ణ చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా కాకినాడ రూరల్ సీఐ కృష్ణ చైతన్య మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో సమయానికి వైద్య సేవలు అందించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటులు, ఇతర అత్యవసర సందర్భాల్లో ప్రజలు భయపడకుండా వెంటనే అంబులెన్స్ సేవలను సంప్రదించాలని సూచించారు. ప్రజల్లో ప్రథమ చికిత్సపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.  డాక్టర్  జయప్రకాష్, హెచ్ఓడి మరియు ఎమర్జెన్సీ ఫిజిషియన్ మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవల్లో “గోల్డెన్ అవర్” ఎంతో కీలకమని వివరించారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలో సరైన చికిత్స అందితే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ వంటి ప్రాథమిక వైద్య పరిజ్ఞానం నేర్చుకోవాలని సూచించారు.  మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ ఎన్. అంజిబాబు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన అత్యవసర వైద్య సేవలను అందించేంద...

ఆదివాసీ రేలా ఉత్సవాల విజయానికి సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Image
రంపచోడవరం : కేంద్రంగా జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ రేలా ఉత్సవాల జయప్రదానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆదివాసీ గిరిజన సంఘం పోలవరం జిల్లా కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. బుధవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు మాట్లాడుతూ ఆదివాసీల అస్తిత్వం, ఉనికి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఈ రేలా ఉత్సవాలు నిలిచాయని తెలిపారు. కనుమరుగవుతున్న ఆదివాసీ భాష, ఆట, పాట, కట్టు, బొట్టు, నృత్యాలను కాపాడుకునే దిశగా ఈ ఉత్సవాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, హక్కులు, చట్టాల పరిరక్షణకు ఈ ఉత్సవాలు అన్ని తెగల ఆదివాసీల ఐక్యతకు దోహదపడతాయని అన్నారు. భవిష్యత్ తరాలకు పూర్వీకుల సంప్రదాయాలను అందించే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి ఉత్సవాలను కొనసాగిస్తామని చెప్పారు. ర్యాలీలు, సభలు, ఉత్సవాలకు సహకరించిన ఆదివాసీ పెద్దలు, సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, మీడి...

సామర్లకోట ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

Image
కాకినాడ : సామర్లకోట బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడకు చెందిన ఇద్దరు మృతి చెందడం పట్ల ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రోడ్డు ప్రమాదంలో ఉప్పాడ మత్స్యకారుల మృతి బాధాకరం: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

Image
కాకినాడ  : సామర్లకోట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉప్పాడకు చెందిన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని కాకినాడ ఎంపీ Uday Srinivas ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జీవనోపాధి కోసం పెద్దాపురం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎంపీ, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ముమ్మిడివరం టీడీపీ పరిశీలకురాలిగా సుంకర పావని నియామకం

Image
కాకినాడ : తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుని ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలిగా మాజీ మేయర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్‌ను నియమించింది. గతంలో తుని నియోజకవర్గ పరిశీలకురాలిగా బాధ్యతలు నిర్వహించిన ఆమెకు పార్టీ వ్యవహారాల్లో విశేష అనుభవం ఉంది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నియామకంపై స్థానిక టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

హెల్మెట్‌ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి

Image
కాకినాడ : రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కాకినాడ కల్పనా సెంటర్ వద్ద ట్రాఫిక్-1 పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. “హెల్మెట్ ధరించి ప్రయాణిస్తే – అది మీ ప్రాణాలను కాపాడుతుంది” అనే నినాదంతో ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించడం బదులుగా కొత్త హెల్మెట్లు కొనిపించి తలపై ధరింపజేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్‌ వినియోగించాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మైనర్లతో వాహనాలు నడపించడం, బైక్ స్టంట్లు చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు అధికమవుతున్నాయని తెలిపారు. రెడ్ సిగ్నల్ సమయంలో స్టాప్ లైన్ వెనుక వాహనాలు నిలిపివేయాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ ఫైన్ జనరేషన్ సిస్టమ్ ద్వారా ఈ-చలానాలు జారీ అవుతాయని పే...

గౌతమి సిటిజన్స్ వ్యవహారం.. డిపాజిట్ దారులు హాజరుకావాలని ఆదేశం

Image
కాకినాడ : కాకినాడలోని గౌతమి సిటిజన్స్ పరస్పర సహాయ సహకార మరియు పొదుపు సంఘం వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల కమిషనర్ మరియు మ్యాక్స్ రిజిస్ట్రార్, గుంటూరు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.  జన్మభూమి పార్క్ ఎదురుగా ఉన్న సంఘానికి సంబంధించిన లావాదేవీలపై విచారణ చేపడుతున్న నేపథ్యంలో, సంఘంలో పొదుపులు చేసిన డిపాజిట్ దారులు తమ ఒరిజినల్ ఎఫ్‌డీ రసీదులు మరియు రెండు జిరాక్స్ కాపీలతో ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్‌లోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉన్న డివిజనల్ సహకార అధికారి కార్యాలయంలో ఈ నెల 29, 30 తేదీలలో విచారణ అధికారి ఎదుట హాజరై తమ వాంగ్మూలాలు సమర్పించాలని అధికారులు సూచించారు.

గోదావరి పుష్కరాలను దేశం మాట్లాడుకునేలా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Image
రాజమహేంద్రవరం : దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునేలా గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఏడాది కాలంలో పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఉభయగోదావరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. పుష్కరాల సందర్భంగా పరిశుభ్రత, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పేపర్ మిల్లుల కాలుష్య నియంత్రణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

Image
రాజమహేంద్రవరం , : ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పేపర్ మిల్లులు సహా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పరిశ్రమల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కాలుష్య స్థాయులపై ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిశ్రమలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పరిశ్రమల సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని హామీ ఇస్తూనే, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి అవసరమైన ధ్రువపత్రాలను సమర్పిస్తామని పరిశ్రమల ప్రతినిధులు తెలిపారు.

ఏకాదశి సందర్భంగా సర్పవరంలో దశ హారతులు

Image
సర్పవరం : శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ఈ నెల 26వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు స్వామివారికి దశ హారతులు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు తెలిపారు. ఏకాదశి పూజ కట్టిన భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి హారతులను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.

రాష్ట్ర సినీ అభివృద్ధి సంస్థ కమిటీలో చిలకలూరిపేటకు చెందిన ముగ్గురికి స్థానం

Image
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) నూతన కమిటీలో చిలకలూరిపేట ప్రాంతానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ కమిటీలో ప్రాంతానికి చెందిన ముగ్గురు ప్రముఖులు డైరెక్టర్లుగా ఎంపిక కావడం విశేషంగా మారింది. డాక్టర్ కందిమళ్ళ సాయిశివరావుతో పాటు నాదెండ్ల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ నటుడు శివాజీ శొంఠినేని, యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు వి. సముద్రలకు కమిటీలో స్థానం లభించింది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు సినీ రంగ ప్రముఖులకు రాష్ట్ర స్థాయి కమిటీలో ప్రాతినిధ్యం దక్కడం పట్ల నియోజకవర్గ పరిధిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్థానిక గ్రామస్తులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఎంపికలు ప్రాంతానికి గౌరవాన్ని తీసుకొచ్చాయని పేర్కొన్నారు.

పండూరు చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే నానాజీ

Image
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ మండలం పి. వెంకటాపురం గ్రామంలోని పండూరు చెరువు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఆదివారం పండూరు చెరువు ప్రాంతంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ పి. వెంకటాపురంలోని పండూరు చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.50 లక్షల వాటర్‌షెడ్ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. గట్టు బలపరిచే పనులతో పాటు వాకింగ్ ట్రాక్, గట్టుపై బెంచీలు, సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం, మొక్కల పెంపకం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ పనుల ద్వారా స్థానిక యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖాదీ బండారు స్టేట్ డైరెక్టర్ శిరంగి శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎంపీడీవో సతీష్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాటికాయల వీరబాబు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ నందిపాటి శ్రీనివాస్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వర...

అక్రమ మట్టి రవాణాపై ఉక్కుపాదం: ఎమ్మెల్యే నల్లమిల్లి హెచ్చరిక

Image
  పెదపూడి, LocalNewsAp : మట్టి రవాణా పేరుతో ప్రకృతి సంపదను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. పెదపూడి పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మండలంలో అక్రమ మట్టి రవాణా అధికమైందని, భారీ వాహనాలతో రోడ్లు ధ్వంసం కావడమే కాక కాలువ గట్లు కూడా దెబ్బతింటున్నాయని తెలిపారు. కంకణాలకోడు డ్రెయిన్ గట్టును కూడా తవ్వుతున్నారనే విషయాన్ని కమ్యూనిస్టు నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఇటీవల ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన సందర్భంగా గ్రామస్తులు సమస్యలను వివరించారని, అనంతరం తహసీల్దార్, ఎస్ఐలతో సమీక్షించి అక్రమ మట్టి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి రెండు ప్రోక్లైనర్లు, ఏడు లారీలను సీజ్ చేసినట్లు తెలిపారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ మట్టి రవాణా చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతులు తమ పొలాల్లో మట్టి సర్దుబాటు పనులు చేసుకుంటు...

కరకుదురు గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి దత్తుడు హామీ

Image
LocalNewsAp : పెదపూడి మండలం కరకుదురు గ్రామంలోని అడపావారి వీధి, గుండావారి వీధి, పాఠంశెట్టి వారి వీధుల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లేక సుమారు 200 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన విద్యుత్ సరఫరా లేక చిన్నపిల్లలతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించాలని కరకుదురు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సింగినీడి దత్తుడును గ్రామస్తులు కోరారు.దీనిపై స్పందించిన సింగినీడి దత్తుడు వెంటనే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడినట్లు తెలిపారు. బుధవారం లోపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ఎన్‌సీసీ క్యాడెట్లకు అవగాహన

Image
కాకినాడ, localnewsap : కాకినాడ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జేఎన్టీయూ అలుమ్ని స్టేడియంలో 9 ఏ ఎయిర్ స్క్వాడ్రన్ (టెక్) ఎన్‌సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.1.50 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స, ప్రమాదం జరిగిన ఏడు రోజులలోపు చికిత్స పొందే పీఎం రాహత్ పథకం గురించి వివరించారు. హెల్మెట్ ధరించడం అవసరం, ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, జీబ్రా లైన్లు లేని చోట రోడ్డు దాటే విధానం, ట్రాఫిక్ గుర్తుల ప్రాధాన్యతను డిజిటల్ తరగతుల ద్వారా వివరించారు. అలాగే ఆటోలలో పరిమితికి మించి ప్రయాణించరాదని, ఈవ్ టీజింగ్ నిషేధం, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, నకిలీ రుణాలు, ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టుల వంటి సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 1930, 1972 నంబర్లను వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ...

కౌడ సేవల విస్తరణకు కృషి చేస్తా: తలాటం సత్య

Image
కాకినాడ జిల్లా : కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడ) సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా విస్తరణ చర్యలు చేపడతానని కౌడ నూతన చైర్మన్ తలాటం నాగ సత్యనారాయణ (సత్య) పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ కుళాయి చెరువులోని గోదావరి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ సత్యతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, అవకాశం లభిస్తుందని, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కౌడ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ పదవి లభించడానికి సహకరించిన పార్టీ నాయకత్వానికి, మద్దతుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట...

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు

Image
కాకినాడ : మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో కాకినాడ నగరం డ్రగ్స్, గంజాయి, రౌడీయిజం, అక్రమాలకు కేంద్రంగా మారిందని, ప్రస్తుతం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) నాయకత్వంలో నగరం అభివృద్ధి, ప్రశాంతత దిశగా పయనిస్తోందని కాకినాడ నగర టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇటీవల వైసీపీకి చెందిన 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మల్లా కిషోర్ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, డివిజన్ ఇంచార్జి పిర్ల లక్ష్మీప్రసన్న మీడియాతో మాట్లాడారు. మల్లా కిషోర్ చదువుకున్న విద్యాసంస్థల వద్ద అక్రమ మట్టిపనులు జరిగాయని, కొంతమంది అనుచరుల ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించారన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన వ్యవహారాలు వెలుగుచూశాయని ఆరోపించారు. కొండబాబు హయాంలో నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ద్వారా సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఏర్పాటు చేసి శాంతిభద్రతలు మెరుగుపరిచారని తెలిపారు. ద్వారంపూడి పాలనలో నేరాలు పెరిగాయని, ప్రజలు విసిగిపోయి ఇప్పుడు వనమాడిని ఆదర...

ఘనంగా ఎమ్మెల్యే సత్యప్రభ జన్మదిన వేడుకలు

Image
  కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా జన్మదిన వేడుకలను నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ప్రత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు తదితరులు స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పెద్ద మార్కెట్ సెంటర్‌లో బాటసారులకు మజ్జిగ, చల్లని త్రాగునీరు పంపిణీ చేశారు. అలాగే అన్న ఎన్టీఆర్ జనార్ధన్ క్యారేజీ ద్వారా పేదలకు చికెన్ బిర్యానీ, మహిళలకు చీరలు, ఐదు కిలోల బియ్యం సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సత్యప్రభ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మండపాక శ్రీనివాస్, మండపాక సాయిరాం, కాలాడి వెంకటేష్, పేర్ల సత్తిబాబు, నవీన్, సంతోష్, శ్రీధర్, కర్రి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” నినాదంతో కొనసాగుతున్న ఉద్యమం

Image
  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న 1877వ రోజు పోరాట టెంట్‌లో ఈరోజు రిలే నిరాహార దీక్షలను ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్మిక నేతలు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అనే నినాదం ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థిక బలానికి వెన్నెముకలని, వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. ఉక్కు కర్మాగారం వేలాది కుటుంబాల జీవనాధారమని, ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్, మేరపురెడ్డి కొండబాబు, గుమ్మడి ఆదినారాయణమూర్తి, పారుపూడి రవి, టి. సాంబశివరావు, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.