పేపర్ మిల్లుల కాలుష్య నియంత్రణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు
రాజమహేంద్రవరం, : ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పేపర్ మిల్లులు సహా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పరిశ్రమల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కాలుష్య స్థాయులపై ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిశ్రమలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పరిశ్రమల సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని హామీ ఇస్తూనే, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి అవసరమైన ధ్రువపత్రాలను సమర్పిస్తామని పరిశ్రమల ప్రతినిధులు తెలిపారు.

Comments
Post a Comment