వారాహి మాత ఆలయ అభివృద్ధికి రూ 5 వేలు విరాళం

బలభద్రపురం: గ్రామంలోని తోటలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన శ్రీ వారాహి మాత భూగర్భాలయ అభివృద్ధి పనులకు భక్తులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా బలభద్రపురం గ్రామానికి చెందిన చిన్నం చక్ర రెడ్డి ఆయన సతీమణి అచ్చయ్యమ్మ కుమార్తె విజయ కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం వారాహి మాత ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.5,000 విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన దేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ వారాహి మాత ఆలయ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. విరాళం అందించిన చిన్నం చక్ర రెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వారాహి మాత ఆశీస్సులు ఆ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...