Posts

Showing posts from June, 2026

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీకి కాకినాడ బార్ అసోసియేషన్ వినతి

Image
కాకినాడ : న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేసి, న్యాయవాదులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు బుధవారం ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీని మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ వెంకట్‌నగర్‌లోని ఆమె నివాసంలో జరిగిన ఈ సమావేశంలో న్యాయవాదులకు హెల్త్ కార్డులు మంజూరు చేయడం, ఇళ్ల స్థలాల కేటాయింపు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో వంకాయల శ్రీరామ్మూర్తి, సీహెచ్‌ఎస్ పార్వతీశ్వరరావు, కర్ర వేణు, మంగా వెంకట శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.

ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు షేక్ సర్ధార్ హుస్సేన్

Image
కాకినాడ జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిని రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి బంగ్లాలో భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా పెదపూడి మండల అధ్యక్షుడు షేక్ సర్ధార్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఎంఈ (స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ), డీఎండీ (డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ) వంటి ప్రాణాంతక, ప్రమాదకర వ్యాధులతో బాధపడుతున్న రోగుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భారత ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు తీరు, భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలపై మంత్రివర్యులతో సుదీర్ఘంగా చర్చించినట్లు షేక్ సర్ధార్ హుస్సేన్ తెలిపారు. ముఖ్యంగా ఈ అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ పరంగా మరింత ఆర్థిక సహాయం, సహకారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ వ్యాధుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భజన బృందాన్ని ఘనంగా సత్కరించిన పుట్టకొండ గ్రామ పెద్దలు

Image
కాకినాడ జిల్లా : పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి ద్వితీయ సప్తాహ మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భజనలు, సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.సప్తాహ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన భజన కార్యక్రమంలో సువర్ణ సింహతలాట సన్మానితులు శ్రీ సలాది బ్రహ్మానందం పాల్గొని భక్తి గీతాలతో భక్తులను అలరించారు. ఆయనతో పాటు పాల్గొన్న భజన బృందం సభ్యులు ఆధ్యాత్మిక గానామృతంతో భక్తులను పరవశింపజేశారు. కార్యక్రమం అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి భజన బృందాన్ని ఘనంగా సత్కరించారు. శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కూళ్ళ బాబి, బంటుమిల్లి ప్రసాద్, అద్దంకి సూరిబాబు, తోటపేట అంజిబాబు, రాజేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. భజన కార్యక్రమానికి హార్మోనియంపై శ్రీ అద్దంకి శివ, డోలుపై శ్రీ లోకేష్ సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స...

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...

Image
కాకినాడ  : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం కాకినాడలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాకినాడ నగరంలోని ఫ్యాబిన్ ఫంక్షన్ హాల్‌ను సందర్శించిన ఆయన, ఉప ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన సభా వేదిక, ప్రజల కూర్చునే ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వాహనాల పార్కింగ్ సదుపాయాలు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకుల సమన్వయ అంశాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ (కౌడా) ఛైర్మన్ తలాటం సత్య గారితో పాటు కూటమి పార్టీల నాయకులు, జనసేన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

అనపర్తి అభివృద్ధికి మరో అడుగు..

Image
అనపర్తి    :  గ్రామంలో రూ.1.20 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఎర్రకాలువ వంతెన నుంచి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వరకు రూ.80 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించగా, రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రంథాలయ భవన నిర్మాణానికి రామచంద్ర పేపర్ మిల్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల నుంచి రూ.20 లక్షలు, మిగిలిన నిధులను మండల పరిషత్ ద్వారా సమకూరుస్తున్నారు. బీటీ రోడ్డు పనులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం–పల్లె పండుగ 2.0 కింద చేపట్టారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బీటీ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని తెలిపారు. నూతన గ్రంథాలయ భవనం విద్యార్థులు, పోటీ ప...

రైల్వే గేట్ వద్ద ఇరుక్కున్న భారీ లారీ

Image
సామర్లకోట : కాకినాడ జిల్లా సామర్లకోట మండల పరిధిలోని ఉండూరు గ్రామ సమీపంలోని రైల్వే గేట్ వద్ద శుక్రవారం భారీ లోడుతో వెళ్తున్న ఓ లారీ ఇనుప గడ్డరుకు చిక్కుకుని నిలిచిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రైల్వే గేటు వద్ద ఎత్తైన, భారీ వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఇనుప గడ్డరును లారీ ఢీకొనడంతో వాహనం అక్కడే ఇరుక్కుపోయింది. గేటు దాటిన అనంతరం గడ్డరు వద్ద లారీ నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాలు బారులుతీరి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సామర్లకోట ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం సిబ్బంది సహాయంతో లారీని బయటకు తీసే చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ ఎత్తు పరిమితిని మించి లోడుతో ప్రయాణించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

Image
కాకినాడ రూరల్ మండలంలోని హార్బర్‌పేట సముద్రతీరం సినీ సందడితో కళకళలాడింది. మౌంటి ప్రొడక్షన్స్ పతాకంపై జాలర్ల జీవన కథాంశాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘గర్భసంద్రం’ చిత్రం షూటింగ్ కార్యక్రమం అక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నీలిమ మాట్లాడుతూ జాలర్ల కుటుంబాల జీవన పోరాటం, సముద్రంతో వారి అనుబంధం, మాతృసెంటిమెంట్ ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. రావణుడి లంకలో జరిగిన ఒక సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని కథను రూపొందించామని, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పూర్తిగా నూతన నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రంలో జాలర్ల జీవితాల్లోని వాస్తవ పరిస్థితులు, వారి కష్టసుఖాలు, కుటుంబ బంధాలు, తల్లి ప్రేమ గొప్పతనం ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ చిత్ర కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయని, ప్రతి పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరణ జరుగుతోందన్నారు. కాకినాడ హార్బర్‌పేటతో పాటు...

జర్నలిజంతో పాటు సేవా కార్యక్రమాలు అభినందనీయం: కలెక్టర్ హరేంధిర ప్రసాద్

Image
కాకినాడ :  కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వ కార్యక్రమంలో సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శి మోహన్, అడ్వైజరీ కమిటీ సభ్యులు అంజిబాబు, దురాని, కృష్ణ, ఆకెళ్ల శ్రీనివాస్, సతీష్, బన్నీ, వీరు తదితరులు పాల్గొన్నారు. పంచాంగ ఆవిష్కరణ సందర్భంగా కలెక్టర్‌కు పంచాంగ ప్రతిని అందజేసి క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ర్యంలో ముద్రించిన ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ సరిపెల్ల వెంకట శ్రీరామచంద్రమూర్తి సిద్ధాంతి విరచిత శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగంను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జర్నలిజం రంగంలో వార్తల ప్రసారంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అభినందనీయమన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న క్లబ్ సభ్యులను ఆయన అభినందించా...

సవాలుగా మారిన కేసును సక్సెస్ చేసిన మెడ్వే సంజీవి ఆస్పత్రి వైద్యులు

Image
కాకినాడ : అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఆస్పత్రికి తరలివచ్చిన ఓ యువకుడికి మెడ్వే సంజీవి ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. గుండెలోని మిత్రల్ కవాటం పనిచేయకుండా పోవడం (స్టక్ మిత్రల్ వాల్వ్)తో పాటు ఊపిరితిత్తుల్లో రక్తగడ్డలు ఏర్పడిన (పల్మనరీ త్రాంబోఎంబోలిజం) క్లిష్ట పరిస్థితిలో 28 ఏళ్ల అశోక్ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి వర్గాల వివరాల ప్రకారం.. రోగి స్పృహ కోల్పోయిన స్థితిలో రాత్రి 10.30 గంటల సమయంలో ఆస్పత్రికి తరలివచ్చాడు. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి తీవ్రతను గుర్తించి అత్యవసర చికిత్స ప్రారంభించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ ఫణిరాజ్, పల్మనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ పృథ్వి, అనస్థీషియాలజిస్టులు డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రావణ్‌లతో కూడిన ప్రత్యేక వైద్య బృందం సమన్వయంతో చికిత్స చేపట్టింది. రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పటికీ వైద్యుల సమయస్ఫూర్తి, నైపుణ్యం, అత్యాధునిక వైద్య సదుపాయాల సహాయంతో చికిత్స విజయవంతమైందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అశోక్ ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయవంతమైన చికిత్సలో...

గోదావరి కాలువలోకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

Image
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట సమీపంలో సోమవారం టిప్పర్ లారీ అదుపు తప్పి గోదావరి కాలువలోకి దూసుకెళ్లింది. వేట్లపాలెం–మేడపాడు మార్గం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే అతడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

5 నెలలుగా వృథా అవుతున్న తాగునీరు... పట్టించుకోని అధికారులు

Image
కాకినాడ రూరల్ : గ్రామంలో ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి నెలల తరబడి మంచినీరు వృథాగా పోతున్నా అధికారులు, పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని తూరంగి మాజీ ఎంపీటీసీ పితాని వెంకట రాము ఆరోపించారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలోని గోపీనగర్ పార్క్ సమీపంలో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి సుమారు ఐదు నెలలుగా నీరు నిరంతరం వృథాగా పోతున్నప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఒకవైపు తూరంగి తీర ప్రాంత కాలనీల ప్రజలు తాగునీటి సమస్యతో ధర్నాలు చేస్తుంటే, మరోవైపు విలువైన తాగునీరు వృథా కావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. జల జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, కేవలం వెయ్యి రూపాయలతో పరిష్కరించగలిగే చిన్న మరమ్మతును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ట్యాంక్ మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టి, గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని పితాని వెంకట రాము డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలి... కలెక్టర్‌కు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ వినతి

Image
కాకినాడ జిల్లా : జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కార్యవర్గం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌ను కోరింది. ఈ మేరకు క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులు అంజిబాబు, శ్రీనివాస్, బాబ్జి, సతీష్, నారాయణ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిత్యం వార్తల సేకరణలో నిమగ్నమై ఉండే జర్నలిస్టులు తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నారని, వారి పిల్లల విద్యాభారం తగ్గించేలా ఫీజు రాయితీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పలువురు కలెక్టర్లు జర్నలిస్టుల పిల్లలకు ఈ సదుపాయం కల్పించారని గుర్తు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై చర్యలు శూన్యం.. అధికారుల తీరుపై మాజీ ఎంపీటీసీ ఆగ్రహం

Image
కాకినాడ జిల్లా : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అధికారుల అలసత్వంతో అపహాస్యం పాలవుతోందని తూరంగి మాజీ ఎంపీటీసీ పితాని వెంకటరాము ఆరోపించారు. అధికారుల పనితీరుపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న పలు అక్రమాలపై సుమారు తొమ్మిది నెలల క్రితం ఫిర్యాదులు చేసినప్పటికీ నేటికీ వాటిపై చర్యలు శూన్యంగానే ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత అంశాలపై నిర్వహించిన విచారణ నివేదికలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు సమర్పించి మూడు నెలలు గడిచినా కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయని విమర్శించారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు వస్తున్నప్పటికీ, వారికి ఎంత మేర న్యాయం జరుగుతోందన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ ప్రాంత సమస్యలపై కూడా దృష్టి సారించాలని క...

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

Image
కాకినాడ : ప్రత్తిపాడు మండలం గోకవరం గ్రామ సర్పంచ్ ఆశా వర్కర్‌పై చేస్తున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ఇన్‌చార్జ్‌లు వచ్చిన తర్వాత చిరు ఉద్యోగులపై వేధింపులు పెరిగాయని ఆరోపించారు. పెద్దిపాలెం పీహెచ్‌సీ పరిధిలో ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న పెదలక్ష్మి 2006 నుంచి గిరిజన, కొండ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మొదట ఉల్లి, గోగులమెట్ట, చింత గ్రామాలకు మాత్రమే సేవలు అందించిన ఆమె, అధికారుల ఆదేశాల మేరకు గోకవరం, గిరిజనాపురం ప్రాంతాల్లో కూడా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, గోకవరం సర్పంచ్ కలెక్టర్ గ్రీవెన్స్‌లో అవాస్తవ ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. తన బంధువులను ఆశా వర్కర్‌గా నియమించుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం సేవల్లో ఉన్న ఆశా వర్కర్‌ను వేధించడం సరికాదన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లపై రాజకీయ కక్షలతో వేధింపులు చేయడం దురదృష్టకరమ...

వెన్నుపోటు గుర్తుకురాలేదా.. మేయర్ కుర్చీ ఎక్కినప్పుడు..

Image
కాకినాడ  : కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని టీడీపీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సునీత రమేష్, నగర మహిళా అధ్యక్షురాలు కొప్పనాతి నాగకుమారి, 22వ డివిజన్ ఇన్‌చార్జి పీర్ల లక్ష్మీ ప్రసన్న తదితరులు వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల నిర్వహించిన ర్యాలీలో మాజీ మేయర్ సుంకర శివ ప్రసన్న ముఖ్యమంత్రి చంద్రబాబును వెన్నుపోటుదారుడిగా అభివర్ణించడంపై స్పందించిన నేతలు, “2017లో చంద్రబాబు, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతోనే కార్పొరేటర్‌గా గెలిచి, అనంతరం మేయర్ పదవి చేపట్టావు. అప్పుడు వెన్నుపోటు గుర్తుకు రాలేదా?” అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా బయట విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలపై అరెస్టులు, ఆంక్షలు ఉండేవని, ప్రస్తుతం ప్రజాస్వామ్య వాతావరణంలో ఎవరికైనా ర్యాలీలు నిర్వహించే స్వేచ్ఛ ఉందన్నారు. కూటమి రెండేళ్ల పాలనలో రాష్ట్ర ర...

ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు అమలు

Image
న్యూఢిల్లీ :  ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచడం, పన్ను ఎగవేతలను అరికట్టడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పాన్ (PAN) వినియోగంపై కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం కొన్ని అధిక విలువ కలిగిన లావాదేవీలకు పాన్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది.  రూ.20 లక్షలకు మించిన స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాలు, రూ.2 లక్షలకు పైబడిన విలువైన వస్తువులు లేదా సేవల కొనుగోలు, రూ.1 లక్షకు మించిన కొన్ని పెట్టుబడి లావాదేవీలు, అలాగే రూ.5 లక్షలకు మించిన విలువ గల వాహనాల కొనుగోళ్లకు పాన్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతా ప్రారంభించడానికి కూడా పాన్ అవసరమని అధికారులు స్పష్టం చేశారు.  పాన్ వివరాలు అందించకపోతే సంబంధిత లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉందని, తప్పుడు వివరాలు సమర్పిస్తే జరిమానాలతో పాటు ఆదాయపు పన్ను శాఖ విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరించారు. పాన్ లేని వారు కొన్ని సందర్భాల్లో నిర్దేశిత ప్రత్యామ్నాయ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.  ఈ నిబంధనల ద్వారా అధిక విలువ గల లావాదేవీలపై మరింత పర్యవేక్షణ సాధ్యమవుతుందని, ఆర్థిక వ్యవస్థ...

చంద్రబాబు దగాకు వారంటీ.. హామీలకు గ్యారంటీ లేదన్న వైఎస్సార్‌సీపీ నేత నాగమణి

Image
కాకినాడ రూరల్ :  కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజలను నిరాశపరిచిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె, సూపర్ సిక్స్ పథకాలు సహా అనేక హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ‘తల్లికి వందనం’ నిధులు ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదని పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన రెండేళ్ల పాలన సభలో ప్రభుత్వం సాధించిన విజయాల కంటే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పేర్లు మార్చడం తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు కొత్తగా అందించిన ప్రయోజనాలు కనిపించడం లేదని విమర్శించారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రుణాలు, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలపై ప్రభుత్వం స్పందించడం లేదని నాగమణి పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్...

పిల్లల ప్రాణాలతో చెలగాటమా.. జన్మభూమి పార్కులో ప్రమాదకర ఆట పరికరాలు

Image
కాకినాడ  : నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేసిన జన్మభూమి పార్కులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట పరికరాలు ప్రస్తుతం ప్రమాదకరంగా మారాయి. పిల్లలు ఎక్కువగా వినియోగించే జారుడు బల్లలు, ఊయలలు తుప్పుపట్టి, కొన్ని చోట్ల ఇనుప షీట్లు చిల్లు పడిన స్థితిలో ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కులోని ఓ జారుడు బల్ల  పైన భాగంలో పెద్ద రంధ్రం ఏర్పడగా, మరో ఆట పరికరం పైభాగం పూర్తిగా తుప్పుపట్టి బలహీనంగా కనిపిస్తోంది. ఊయలల గొలుసులు, సీట్లు కూడా దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది. వేసవి సెలవులు కావడంతో ప్రతిరోజూ వందలాది మంది చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి పార్కుకు వస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో పరికరాలు విరిగిపోతే తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "పిల్లలను పార్కుకు తీసుకొస్తే ఆనందంగా ఆడుకోవాల్సింది పోయి, ఏ పరికరం ఎప్పుడు విరిగిపోతుందోనన్న భయంతో కంటిమీద కునుకు లేకుండా చూడాల్సి వస్తోంది. అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత స్పందించకుండా ముందుగానే మరమ్మతులు...

మరణించిన కార్యకర్త కుటుంబానికి టీడీపీ అండ.. బాబి నాయకత్వంలో 5 లక్షల బీమా క్లెయిమ్

Image
కాకినాడ రూరల్ నియోజకవర్గం : తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్త కుటుంబానికి పార్టీ అధిష్టానం భరోసాగా నిలిచింది. కరప మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త త్రిమూర్తులు మేనవల్లి అకాల మరణంతో విషాదంలో ఉన్న కుటుంబానికి సభ్యత్వ బీమా ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందింది. ఈ మొత్తాన్ని మృతుడి నామినీ వీరరాఘవలు మేనవల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గ కో-కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) తెలిపారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను ఎన్నటికీ మరచిపోమని, వారి కుటుంబాలకు అండగా నిలవడం తెలుగుదేశం పార్టీ బాధ్యత అని బాబి పేర్కొన్నారు. కష్టకాలంలో ఈ బీమా సొమ్ము కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని, వారి సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామ్యం అవుతుందని చెప్పారు. బీమా క్లెయిమ్ సకాలంలో అందడంతో బాధిత కుటుంబ సభ్యులు పార్టీ అధిష్టానానికి, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, కటకంశెట్టి బాబికి కృతజ్ఞతలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్..

Image
విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తగరపువలసలో జరిగిన అమ్మవారి ఉత్సవాల్లో డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొని తన బృందంతో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  సమాచారం ప్రకారం, ప్రయాణం మధ్యలో టీమ్‌లోని ఓ సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో రోడ్డుపక్కన కారును ఆపారు. ఆ సమయంలో పండు మాస్టర్ కారు నుంచి దిగి రోడ్డుపై నిలబడి ఉండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ నిలిచి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో పండు మాస్టర్‌కు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.  ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహచరులు ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం కారణమా లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.  తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేక డ్యాన్స్ స్టైల్‌తో గుర్తింపు పొందిన పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ మరియు టెలివిజన్ రంగ ప్రముఖులు సోషల్ మీడియాలో...

పులి పంజా.. 13 లేగదూడల బలి

Image
దేవీపట్నం : అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పులి బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన పులి దాడిలో 13 లేగదూడలు మృతి చెందాయి. ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పులి కదలికలను గుర్తించి పట్టుకునేందుకు 6 ర్యాపిడ్ రెస్క్యూ బృందాలు, 5 ప్రజా అవగాహన బృందాలు, 4 ట్రాంక్విలైజింగ్ బృందాలు, 2 డ్రోన్ బృందాలు, ఒక కేజ్ బృందం, ఒక వన్యప్రాణి అంబులెన్స్ బృందంతో పాటు 19 హనుమాన్ బృందాలను రంగంలోకి దింపారు. మొత్తం సుమారు 100 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ముఖ్య వన్యప్రాణి సంరక్షకులు ఎన్. నాగేశ్వరరావు, రాజమండ్రి ముఖ్య అటవీ సంరక్షకురాలు డాక్టర్ జ్యోతి, రంపచోడవరం డీఎఫ్‌ఓ ఎన్. రామచంద్రరావు తదితర అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పశువులను కోల్పోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరోవైపు ప్రజల భద్రత దృష్ట్యా పోతవరం–దండంగి రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి దిగ్బంధం చేశారు. పులి సంచార...

కూటమి నేతలైనా వదిలేది లేదు.. పన్ను ఎగవేతదారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

Image
అమరావతి :  నెలకు రూ.10 వేల సంపాదించే సాధారణ ఉద్యోగిపై పన్నుల భారం మోపుతున్నామని, కానీ కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తూ భారీ ఆదాయాలు ఆర్జిస్తున్న వారి వద్ద నుంచి ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయడంలో వ్యవస్థ విఫలమవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పన్నుల విషయంలో ఎలాంటి రాజకీయ పక్షపాతం ఉండకూడదని, అది కూటమి పార్టీల నాయకులైనా, అధికార పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీసే పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలపై అదనపు భారం మోపడం కంటే భారీ స్థాయిలో వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దాచిపెడుతున్న వారిని గుర్తించి వసూళ్లు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి రూపాయి కీలకమని, ప్రజల సొమ్మును కాపాడటంలో ప్రభుత్వం రాజీపడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.