రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్..
సమాచారం ప్రకారం, ప్రయాణం మధ్యలో టీమ్‌లోని ఓ సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో రోడ్డుపక్కన కారును ఆపారు. ఆ సమయంలో పండు మాస్టర్ కారు నుంచి దిగి రోడ్డుపై నిలబడి ఉండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ నిలిచి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో పండు మాస్టర్‌కు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహచరులు ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం కారణమా లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేక డ్యాన్స్ స్టైల్‌తో గుర్తింపు పొందిన పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ మరియు టెలివిజన్ రంగ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు.

Comments
Post a Comment