ప్రజల ఫిర్యాదుపై స్పందించిన నానాజీ.. రహదారికి మరమ్మతులు

కాకినాడ రూరల్: కాకినాడ ఎల్బీ నగర్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల వెనుక నుంచి ముత్తా వారధికి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు స్వల్పంగా దెబ్బతినడంతో స్థానిక ప్రజలు కూటమి నాయకుల ద్వారా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నానాజీ రహదారికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించారు. శనివారం మరమ్మతులు పూర్తయిన రహదారిని ఎమ్మెల్యే నానాజీ స్వయంగా పరిశీలించి వాహనదారుల రాకపోకలను పునరుద్ధరించారు. ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించి రాకపోకలు పునరుద్ధరించినందుకు ఎల్బీ నగర్ ప్రజలు వాహనదారులు కూటమి నాయకులు ఎమ్మెల్యే నానాజీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట రూరల్ జనసేన నాయకులు పాండ్రంకి రాజు తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...