ఆషాఢమాసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సారి సమర్పణ
పెదపూడి : మండలంలోని రామేశ్వరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం భక్తులు సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా సారి సమర్పించిన అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, సొసైటీ చైర్మన్ కోలా సత్యనారాయణ, ఎంపీటీసీ మద్దూరి సూరిబాబు, బీజేపీ నాయకుడు బుజ్జి మాట్లాడుతూ.. ఆషాఢమాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో అమ్మవారి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గొల్లపల్లి చిన్న, మద్దూరి నాని, కోలా వీరబాబు, వాసంశెట్టి వెంకటరమణ, మద్దూరి గంగాధర్, కోలా సత్తిబాబు, గొల్లపల్లి కోటిబాబు, తోటకూర కృష్ణ, కొండెపూడి పవన్ కుమార్, తోట సత్యనారాయణతో పాటు పలువురు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.

Comments
Post a Comment