Posts

Showing posts from July, 2026

బాపన్నదొర కాలనీలో నేత్ర వైద్య శిబిరం

Image
కాకినాడ రూరల్ :   కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలోని బాపన్నదొర కాలనీ సామాజిక భవనంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ వైద్యులు 260 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 160 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాటికాయల వీరబాబు మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం సామాజిక బాధ్యత అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాలనీ అధ్యక్షుడు ఎ. దిలీప్ కుమార్ వర్మ మాట్లాడుతూ, కాలనీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు రామిశెట్టి సునీల్, కాలనీ ఉపాధ్యక్షుడు ఎం. అశోక్ చౌదరి, కార్యదర్శి కృష్ణమోహన్, కోశాధికారి ఉదయభాస్కర్, సభ్యులు డాక్టర్ గరికిపర్తి నమశ్శివాయ, కేఎస్‌ఎన్, బర్రె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

Image
పిఠాపురం :  ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డాక్టర్ జ్యోతుల రాంబాబు గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సమయానికి కళాశాలకు హాజరవుతున్నారా అనే అంశాన్ని పరిశీలించడంతో పాటు కళాశాల పరిశుభ్రత, తరగతి గదులను తనిఖీ చేశారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పిఠాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగేలా కృషి చేస్తానని డాక్టర్ జ్యోతుల రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డి.ఆర్‌.కె. రెడ్డి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

డీఎస్సీ ఆరోపణలు రుజువు చేస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా....పేరాబత్తుల రాజశేఖర్

Image
కాకినాడ రూరల్  : మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. కాకినాడ రూరల్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు లేదా లొసుగులు జరగలేదని స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ నాయకులు తమ ఆరోపణలను ఆధారాలతో రుజువు చేస్తే తాను ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు పూర్తిగా కట్టుబడి ఉందని, ఏదైనా పొరపాటు జరిగితే నైతిక బాధ్యత వహించడానికి వెనుకాడదని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రభుత్వం విస్మరించలేదని, భృతి ఇవ్వడం కంటే యువతకు శాశ్వత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్ప...

కాకినాడ రూరల్ వైసీపీ బూత్ కమిటీల ఉపాధ్యక్షుడిగా వెల్లంకి రమేష్ నియామకం

Image
కాకినాడ   : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కాకినాడ రూరల్ మండల బూత్ కమిటీల విభాగం ఉపాధ్యక్షుడిగా వెల్లంకి రమేష్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది.ఈ మేరకు పార్టీ అధికారిక గుర్తింపు కార్డును విడుదల చేసింది. బూత్ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం, కార్యకర్తల సమన్వయం,పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి బాధ్యతలను ఆయననిర్వర్తించనున్నారు. నియామకంపై స్పందించిన వెల్లంకి రమేష్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.గ్రామాలు,వార్డులు,బూత్ కమిటీల మధ్య సమన్వయాన్ని పెంచుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.ఈ అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, జిల్లా పార్టీనాయకత్వం, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మండల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలకు అండగ...

సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ నిబంధనల ఉల్లంఘనపై ట్రాఫిక్ పోలీసుల కొరడా.. భారీ జరిమానాలు

Image
కాకినాడ: జిల్లా ఎస్పీ విందు మాధవ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎం. కిషోర్ బాబు ఆధ్వర్యంలో బుధవారం టౌన్ హాల్ సెంటర్‌లో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం, అతివేగంగా వాహనాలు నడపడం, మైనర్లు డ్రైవింగ్ చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై భారీ జరిమానాలు విధించారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్‌స్పీడ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగం వల్ల వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. అలాగే రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం చేసిన వారికి "గుడ్ సమారిటన్" పథకం కింద రూ.25 వేల నగదు బహుమతి, ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు నగదు రహిత ఉచిత చికిత్స, ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల వరకు ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ సంకేతాలు, జీబ్రా లైన్లు లేని చోట రోడ్డు దాటే విధానం, హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాఫిక్-1 సీఐ ఎన్. రమేష్‌తో పాటు ట్రాఫిక్ సి...

రైతు బజార్‌లో రైతులకే చోటులేదా..? జేసీ ఎదుట రైతుల ఆవేదన

Image
కాకినాడ జిల్లా ... కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల రైతు బజార్ బజారులో ఉన్న రైతులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారనీ గత 25 సంవత్సరాలుగా అదే రైతు బజార్లో రైతులు బుధవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్'ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన రైతులు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల రైతు బజార్లో మాకినేని భాస్కర్ అనే వ్యక్తి రైతు బజార్ స్థలాన్ని ఆక్రమించుకుని షాపులు కట్టి రైతుబజార్లో ఉన్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అడిగితే తాము రైతులం కాదని ఇక్కడ వ్యాపారాలు చేయనీనని వైసీపీ నేత నక్కా కిషోర్ అనే వ్యక్తితో బెదిరిస్తున్నట్లు వాపోయారు. తామంతా రైతుల నేనని ఎప్పటికప్పుడు అద్దెలు చెల్లిస్తూ వ్యాపారులు చేసుకున్నప్పటికీ అతను తమపై దౌర్జన్యం చేస్తూ కేసులు పెడుతూ ఇబ్బందులు కురిచేస్తున్నారని తమకు న్యాయం చేయాలని రైతు కర్ని వీర్రాజు జనసేన నాయకులతో వచ్చి ఫిర్యాదు చేశారు. జనసేన నాయకులు చింతపల్లి బన్నీ మాట్లాడుతూ వ్యవసాయ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ అనే వ్యక్తి వైసీపీ నాయకులతో కలిసి కూటమి నాయకులకు అన్యాయం చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ...

గురువే ప్రత్యక్ష దైవం.. గురు పౌర్ణమి సందర్భంగా మోహన్‌కు ఘన సన్మానం

Image
కాకినాడ : స్థానిక ఈశ్వర్‌నగర్‌లోని మోహన్ కాన్వెంట్ వ్యవస్థాపకులు మోహన్‌ను గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ దంత వైద్య నిపుణులు డా. అడ్డాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ గురువులు కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే శిల్పులని అన్నారు. ప్రతి డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త, నాయకుడి విజయానికి వెనుక గురువు కృషి ఉంటుందని, విద్యార్థుల్లోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించేవారే గురువులని పేర్కొన్నారు. పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సమాజంలో ఎలా జీవించాలో గురువులే బోధిస్తారని, విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగితే తల్లిదండ్రులతో సమానంగా ఆనందించేది గురువేనని అన్నారు. డా. అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ మోహన్ విద్యా రంగంలో ఎన్నో ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఆదర్శ గురువని కొనియాడారు. అన్ని వృత్తుల్లో గురు వృత్తి అత్యంత పవిత్రమైనదని, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే భారతీయ సంస్కృతి గురువుకు విశిష్ట స్థానం కల్పించిందన్నారు. ఆషాఢ పౌర్ణమి రోజున వేదవ్యాస మహర్షి జయంతి సందర్భంగా గు...

గైగోలుపాడులో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

Image
కాకినాడ రూరల్  : గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రమణయ్యపేట గ్రామపంచాయతీ పరిధిలోని గైగోలుపాడు లో గల శ్రీ సిద్ధి వినాయక శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి–సత్యనారాయణమూర్తి దంపతులు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్‌బాబు కార్యాలయ ఇన్‌చార్జి, టీడీపీ సీనియర్ నాయకులు మేకా లక్ష్మణమూర్తి, జనసేన రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తాటికాయల వీరబాబు, సానా సతీష్‌బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తదితరులు సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. గైగలపాడు ప్రాంత అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. సాయిబాబా ఆశీస్సులతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పిల్లి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, పలువురు పెద్...

వాకలపూడిలో నూతన మార్కెట్ 23 దుకాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ

Image
కాకినాడ రూరల్  :రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీ నిధులతో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన 23 వ్యక్తిగత దుకాణాలతో పాటు చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్‌ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వ్యాపారులకు మెరుగైన వాణిజ్య వసతులు కల్పించడంతో పాటు గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ నిర్మాణాల ద్వారా గ్రామ ఆర్థికాభివృద్ధి వేగవంతమవడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చిక్కాల రామచంద్రరావు, పితాని లీలా, నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, రంభాల వెంకటేశ్వరరావు, శిరంగు శ్రీనివాస్, తాటికాయల బుజ్జి, గంటా ప్రసాద్, గేదల చిన్నారావు, యజ్జల ప్రసాద్, మాత లక్ష్మణ్, చొక్కా జగన్, మంజు, ధనుష్, కుమారి, వెంకటేశ్వరరావు, కనిగిరి సత్యనారాయణ, కనీతి శ్రీనివాస్, జీని శ్రీనివాస్, సోదే ముసలయ్య, సునీల్, పండు, సతీష్, నూటన్ ఆనంద్, పైలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ లో నూతన హై డిపెండెన్సీ యూనిట్ ప్రారంభం

Image
కాకినాడ : మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన హై డిపెండెన్సీ యూనిట్ (HDU) ను నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, ఆధునిక వైద్య సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో మరియు క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు హై డిపెండెన్సీ యూనిట్ ఎంతో ఉపయోగపడుతుందని, అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బందితో ఈ హై డిపెండెన్సీ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్, కాకినాడ సెంటర్ హెడ్ నందికోళ్ళ అంజిబాబు మాట్లాడుతూ,పెద్దాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా, అలాగే కోనసీమ జిల్లాల్లోని అనేక మంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు మరియు శస్త్రచికిత్సల అవసరాల సమయంలో తన సొంత డబ్బులతో వైద్య సహాయం అందించిన వ్యక్తి నిమ్మకాయల చినరాజప్ప అని తెలిపారు. కాకి...

మానవ సేవే నిజమైన ఆధ్యాత్మికత

Image
కాకినాడ రూరల్  : మానవత్వమే దివ్యత్వానికి తొలి మెట్టని, ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రశాంత జీవితం సాధ్యమవుతుందని స్ఫూర్తి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని ప్రజ్ఞా ఫంక్షన్ హాల్‌లో గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధనలు నిర్వహించి మానవత్వం, ఆత్మజ్ఞానం, ఇంద్రియ నిగ్రహం, ప్రశాంత జీవన విధానంపై ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ మానవత్వంతో ఆదరించడమే నిజమైన ఆధ్యాత్మికత అని వక్తలు తెలిపారు. హిందూస్థాన్ షిప్‌యార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ డి. శ్రీనివాసరావు, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తరపట్ల సత్యనారాయణ, మాధవరపు వీర రాఘవ రాము ప్రసంగిస్తూ ధ్యాన సాధనతో శారీరక, మానసిక ప్రశాంతతతో పాటు ఆధునిక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం సమాజంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను స్ఫూ...

వికాస ఆధ్వర్యంలో మరో 50 మందికి ఉపాధి..కలెక్టర్‌ను కలిసిన ఎంపికైన అభ్యర్థులు

Image
కాకినాడ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమంలో భాగంగా వికాస ఆధ్వర్యంలో బెంగళూరులోని ఫాక్స్‌కాన్ కంపెనీలో మొబైల్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన 50 మంది అభ్యర్థులు సోమవారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌ నుంచి ప్రత్యేక బస్సులో అభ్యర్థులను కంపెనీకి పంపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్వో తిప్పే నాయక్ దేశావత్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. లచ్చారావును అభినందించారు. వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. లచ్చారావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఫాక్స్‌కాన్ కంపెనీలో సుమారు 500 మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.19 వేల వేతనంతో పాటు ఉచిత భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వికాస సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వికాస మేనేజర్లు, సి...

గొల్లప్రోలు నూతన కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకుల

Image
గొల్లప్రోలు : గొల్లప్రోలు మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన దివిజ సంపతిని సోమవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో నెలకొన్న పారిశుధ్య సమస్యలు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి ప్రజా సమస్యలపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. నూతన కమిషనర్ సమర్థవంతమైన నాయకత్వంలో గొల్లప్రోలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన బీజేపీ నాయకులు, ప్రజా సమస్యల పరిష్కారంలో తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. కమిషనర్ దివిజ సంపతి సానుకూలంగా స్పందిస్తూ, ప్రజల సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మలిరెడ్డి నారాయణరావు, కర్రీ సత్యనారాయణ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

పిల్లి దంపతుల ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం

Image
కాకినాడ రూరల్ : రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలతో ప్రత్యక్ష అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధికార తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. టీడీపీ కాకినాడ రూరల్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో నేమం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నేమం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ఆరంభించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి వివరించి ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంత...

రాజ సింహ అవార్డు అందుకున్న కరుణ్ రాజు

Image
పిఠాపురం  : పిఠాపురానికి చెందిన లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ టి. కామేశ్వరరావు (కరుణ్ రాజు)కి విశిష్ట సామాజిక సేవలకు ‘రాజ సింహ అవార్డు 2026 అందుకున్నారు.తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సమీపంలోని న్యూ గుండ్లవెల్లి, యాదగిరిగుట్టలోని కె.యం గ్రాండ్ హోటల్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం (జూలై 26) ఆదర్శ కళానిలయం సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులను ఈ సందర్భంగా సత్కరించి అవార్డులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పిఠాపురానికి చెందిన లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ టి. కామేశ్వరరావు (కరుణ్ రాజు)కి సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ప్రతిష్ఠాత్మకమైన రాజ సింహ అవార్డు–2026 ను ప్రదానం చేశారు.ఈ అవార్డును ప్రభుత్వ విప్, అలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆదర్శ కళానిలయం సంస్థ ఛైర్మన్ డాక్టర్ సి.హెచ్. ప్రకాశ్ తో పాటు పలువురు ప్రముఖులు చేతులు మీదుగా అందజేశా...

నీట్, మెగా డీఎస్సీ అవకతవకలపై నిరసన ర్యాలీకి విద్యార్థులు, యువత ముందుకు రావాలి: ఉంగరాల సంతోష్

Image
కాకినాడ : నీట్ పరీక్ష, మెగా డీఎస్సీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలు, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి వంటి సమస్యలపై ఈ నెల 28న నిర్వహించనున్న నిరసన ర్యాలీలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కేవలం వైఎస్సార్‌సీపీకి సంబంధించినది కాదని, రాష్ట్రంలోని విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న అన్యాయాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ప్రజా నిరసన అని ఆయన పేర్కొన్నారు. అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురాకపోతే భవిష్యత్తులో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతారని ఆందోళన...

యువత తలచుకుంటే ప్రభుత్వాలను గద్దె దించగలరు

Image
కాకినాడ : దేశవ్యాప్తంగా యువత చేపట్టిన పోరాటంతో కేంద్ర మంత్రితో రాజీనామా చేయించవచ్చని నిరూపితమైందని జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవజ్ఞులు జగ్గరపు మల్లికార్జున పేర్కొన్నారు. ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ చారిత్రాత్మక పోరాటాన్ని పార్టీ తరఫున ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా జగ్గరపు మల్లికార్జున్ మాట్లాడుతూ యువత తలచుకుంటే రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఎవరినైనా గద్దె దించగలమనే సత్యాన్ని ఈ ఉద్యమం రుజువు చేసిందని ఆయన తెలిపారు. దేశం, ప్రపంచం చూసేలా ఇంత పెద్దఉద్యమంజరుగుతున్నప్పటికీ మిగతా రాజకీయ నాయకుల గొంతులు మూగపోవడంపై విమర్శలు గుప్పించారు. గత 6 సంవత్సరాల నీట్ పరీక్ష రికార్డులను పరిశీలిస్తే సుమారు 93 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం అత్యంత ఆవేదనకరమని పేర్కొన్నారు. 2026 సంవత్సరంలో విద్యార్థులు పోరాడి సాధించిన విజయాన్ని, ఆ చనిపోయిన 93 మంది విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం నీట్ ఉద్యమం కాదని, జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న యువత ఉద్యమమని స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్...

వీరుడి విగ్రహం దుస్థితి.. ఏడాదిగా పట్టించుకోని అధికారులు

Image
కాకినాడ : బ్రిటిష్ వాళ్ల గుండెల్లో గడగడలాడించిన మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకు స్థానికంగా దక్కుతున్న గౌరవం ఇదేనా అంటూ ప్రజలు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆ విప్లవవీరుడి విగ్రహం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై ఎవరి కంట పడకుండా మూలకు చేరింది.కాకినాడ రూరల్ మండలం తూరంగి బొట్టు చెరువు వద్ద ప్రధాన గేటు పక్కన అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉండేది. అయితే, ఆ ప్రాంతంలో ప్రహరీ గోడ నిర్మాణ పనుల నిమిత్తం ఈ విగ్రహాన్ని తొలగించి, పక్కనే చెరువు వద్ద ఉంచారు. నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12 నెలల (ఒక ఏడాది) గడుస్తున్నా ఈ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించే దిశగా ఎవరూ దృష్టి పెట్టకపోవడం అత్యంత దురదృష్టకరమని స్థానికులు మండిపడుతున్నారు.ఈ బొట్టు చెరువు చుట్టూ రోజూ వందలాది మంది వాకర్స్, స్థానికులు వ్యాయామం మరియు నడక కోసం వస్తుంటారు.దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుని విగ్రహం ఇలా నెలల తరబడి చెరువు ఒడ్డున అనాథలా పడి ఉండటాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుక...

శ్రీ విశ్వ విజ్ఞాన పీఠంలో 29న గురు పౌర్ణమి మహాసభ

Image
కాకినాడ : విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో (పిఠాపురం)ఈనెల 29న గురు పౌర్ణమి సందర్భంగా అధిపతులు డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి ఆధ్వర్యంలో మహాసభ జరుగుతోందని పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటల నుండి 12:30 గంటల వరకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపి అయినా పీఠాధిపతులు స్వామివారి దివ్య పాదాలకు గులాబీ రేఖలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుందని, సుమారు 5000 మంది సభ్యులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వివరించారు .వచ్చిన వారందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారి ఆశీస్సులను పొందవలసిందిగా ఆయన కోరారు.

బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ ర్యాలీ

Image
కాకినాడ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ ఇమ్మంది లక్ష్మీ పార్థసారథి గారి ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఘనంగా కార్గిల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీ కాకినాడలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమై, ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని అమరవీరుల స్థూపం వరకు సాగింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కార్గిల్ అమరవీరులకు నివాళులర్పిస్తూ దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు చోడిశెట్టి రమేష్ గారు, కుండల సాయి యాదవ్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు పెండం శ్రీదేవి గారు, ముసలిగంటి సురేష్ గారు, దొడ్డి వీరేంద్ర గారు, గౌతు చిన్నారావు గారు, కర్రి సత్యనారాయణ రాజు గారు, చెక్క రమేష్ గారు పాల్గొన్నారు. అలాగే యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు ఏనుగుల లచ్చబాబు గారు, జట్ల దుర్గా చైతన్య సాయి గారు, జిల్లా ఉపాధ్యక్షులు ఓలేటి రాంబాబు గారు, వాసం మధు గారు, కర్రి వీరేంద్ర గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, యువ మోర్చా కార్యకర...

లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు

Image
కాకినాడ జిల్లా :  కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ గారి పర్యవేక్షణలో, కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వన్‌టౌన్ సీఐ శ్రీ ఎం. నాగదుర్గారావు గారి ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.   జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, పేకాట, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడం, అలాగే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం లక్ష్యంగా లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లాడ్జీల్లో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, రిజిస్టర్లు, గుర్తింపు పత్రాలను పరిశీలించి నిబంధనల అమలును తనిఖీ చేశారు.లాడ్జి యజమానులు, నిర్వాహకులు ప్రతి అతిథి నుంచి ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటో గుర్తింపు పత్రం తప్పనిసరిగా తీసుకున్న తర్వాతే గదులు కేటాయించాలని ఆదేశించారు. సందర్శకుల పూర్తి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయడంతో పాటు వాటి కాపీలు ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ కి పంపాలని సూచించారు.అదేవిధంగా ఎవరైనా కొత...

భవితరాల కోసం 10 వేల సీడ్ బాల్స్.. చేయూత చారిటబుల్ సొసైటీ వినూత్న పర్యావరణ ఉద్యమం

Image
కాకినాడ: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా అటవీ శాఖాధికారి (DFO) ఎన్. రామచంద్రరావు పిలుపునిచ్చారు.  చెట్లు నాటడం అంటే భూమికి ప్రాణం పోయడం ఒక సీడ్ బాల్ తయారు చేయడం అంటే భవిష్యత్తుకు ఆశను నాటడం అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సుమారు 10,000 సీడ్ బాల్స్ ప్రిపరేషన్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చేయూత రవి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం తాము చేపట్టిన ఈ ఉద్యమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ మెరుగైన పచ్చటి వాతావరణం అందించడమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా వ్యవహరించాలని అన్నారు. ఈ సీడ్ బాల్స్ నిపుణుల పరిరక్షణలో అత్యంత శాస్త్రీయ పద్ధతిలో సిద్ధం చేసామని ఈ తయారైన విత్తన బంతులను డ్రోన్లు మరియు ఇతర సులభతర మార్గాల ద్వారా వివిధ ప్రాంతాలలో ఖాళీ స్థలాల్లో అటవీ ప్రాంతాలు కొండ ప్రాంతాలు మరియు కోస్టల్ తీర ప్రాంతాల ఏరియాలో వెదజల్లడానికి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల రెండో తారీకు స్నేహితుల ది...

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో పిఠాపురం క్రీడాకారుల సత్తా

Image
  పిఠాపురం:  మండపేటలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో పిఠాపురం క్రీడాకారులు ప్రతిభ చాటుతూ మొత్తం 11 పతకాలు సాధించారు. పిఠాపురానికి చెందిన కోచ్ పి. లక్ష్మణరావు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు 8 స్వర్ణ, 2 రజత, 1 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారని ఆయన తెలిపారు. స్వర్ణ పతకాలు సాధించిన వారిలో సి.హెచ్. ప్రణయ్, ఎస్. హర్ష, ఎం. సాయి తేజ, జె. దర్శన్ గిరీష్, ఎస్. జోష్ వెస్లీ, ఎం. జాస్విక, పి. హంసిక, ఎం. రీత్విక ఉన్నారు. కె. జోయల్, పి. శ్యామ్ రజత పతకాలు సాధించగా, జె. సూర్య గౌతమ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. విజేతలను కోచ్ పి. లక్ష్మణరావు అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.

మొక్క నాటి భవిష్యత్తుకు బాటలు వేసిన ఆల్ ఈజ్ వెల్ సేవా సంస్థ

Image
కాకినాడ  : జాతీయ చెట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శశికాంత్ నగర్ ఉద్యానవనంలో ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా మొక్కల నాటే కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం కా కాకినాడ: జాతీయ చెట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శశికాంత్ నగర్ ఉద్యానవనంలో ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా మొక్కల నాటే కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు సుమారు 32 పెద్ద మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. సంస్థ వ్యవస్థాపకులు కిషోర్ మాట్లాడుతూ, కాకినాడను పచ్చని, అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ఆల్ ఈజ్ వెల్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. నగరంలోని పలు కళాశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన 'జెన్ గ్రీన్' కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని, పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్తులోనూ సేవలను కొనసాగిస్తామని తెలిపారు. సంస్థ సభ్యులు, దంత వైద్యులు డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ, జూలై 26న నిర్వహించే జాతీయ చెట్ల దినోత్సవం ప్రాధాన్యాన్ని వివరించారు. చెట్లు మానవులకు ప్రాణవాయువును అందించడంతో పాటు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ...

నిత్యవసర సరుకులు పంపిణీ

Image
కాకినాడ రూరల్ర: మణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో బొల్లోజు శ్రీనివాస్ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధ రాజు సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకుని నిస్వార్ధంగా సేవ చేయడం, దయ చూపడమే మానవత్వం అని అన్నారు .ఎవరికి సేవ చేసినా దేవునికి సేవ చేసినట్లుగా భావించాలన్నారు. ఆ దిశగా బొల్లోజు శ్రీనివాస్ ప్రతినెల పేదలకు సహాయం చేయడం అభినందనీయమని సత్యనారాయణ రాజు తెలిపారు . ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, శ్రీవాణి, నిమ్మకాయల వెంకటేశ్వరరావు , రాజా, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ద్రితి ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో బ్రూణహత్యల నివారణకు అవగాహన కార్యక్రమాలు.. డాక్టర్ శుభ శేఖర్ రెడ్డి

Image
కాకినాడ : లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఆడ శిశువు అని గుర్తించి గర్భస్రావం చేయించడం చట్టరీత్యా నేరమని, అయినప్పటికీ కొందరు తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఇటువంటి సంఘటనలు ఇంకా జరుగుతుండటం అత్యంత బాధాకరమని బ్లూ రైన్ హాస్పిటల్స్ అధినేత, ద్రితి ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ శుభ శేఖర్ రెడ్డి అన్నారు.బ్లూ రైన్ హాస్పిటల్స్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ద్రితి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రూణహత్యల నివారణ కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గర్భధారణ, ప్రసవం లేదా నవజాత శిశువుల వైద్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అవసరమైన వైద్య సేవలు, ఆర్థిక సహాయం అందించేందుకు ట్రస్ట్ కట్టుబడి ఉందన్నారు.''ఆడపిల్లలు వద్దు" అనే ఆలోచన సమాజ భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొంటూ, మహిళలు ప్రతి రంగంలోనూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. మహిళా క్రీడాకారిణులు, శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు, పరిపాలన రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలు ప్రత...

ఫ్లెక్సీ రహిత నగరం ప్రచారంలో భారీ ఫ్లెక్సీ

Image
కాకినాడ : నగరంలో ఫ్లెక్సీల వాడకాన్ని అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన ‘ఫ్లెక్సీ రహిత నగరం’ ప్రచార కార్యక్రమంలో అధికారుల ద్వంద్వ వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారుల ప్రచార ఆర్భాటం: నగరంలో ఫ్లెక్సీల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలనే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు ఒక ప్రత్యేక ర్యాలీని నిర్వహించారు. ఫ్లెక్సీ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ ర్యాలీలోనే అధికారులు స్వయంగా భారీ ఫ్లెక్సీలను ఉపయోగించడం గమనార్హం.ఒకవైపు సాధారణ ప్రజలు, వ్యాపారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జరిమానాలు విధిస్తూ చర్యలు తీసుకుంటున్న అధికారులు.. తమ ప్రచార కార్యక్రమానికి మాత్రం ఏకంగా ఫ్లెక్సీలనే వాడటం వారి మాటలకు, చేతలకు ఉన్న తేడాను స్పష్టంగా ఎత్తిచూపుతోంది" అని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఫ్లెక్సీ రహిత కాకినాడే లక్ష్యం.. ప్రజల సహకారంతోనే సాధ్యం: కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ

Image
కాకినాడ : ఫ్లెక్సీ రహిత కాకినాడ నిర్మాణమే లక్ష్యంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణారావు అధ్యక్షతన సర్పవరం జంక్షన్ నుంచి భానుగుడి జంక్షన్ వరకు జరిగిన ఈ ర్యాలీలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం భానుగుడి సెంటర్‌లో మానవహారం నిర్వహించి, "ఫ్లెక్సీ రహిత కాకినాడ మన లక్ష్యం", "పర్యావరణ పరిరక్షణకు అందరం సహకరిద్దాం" అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేస్తేనే ఫ్లెక్సీ రహిత కాకినాడను నిర్మించగలమని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా 200 మైక్రాన్లకు పైబడిన అనుమతితో కూడిన ఫ్లెక్సీలను మాత్రమే ఏర్పాటు చేయాలని, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్లెక్సీ నిషేధాన్ని విజయవంతం చేయడానికి ప్...

పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న మాజీ సర్పంచ్ చీకట్ల వెంకటేష్

Image
సామర్లకోట: స్వర్ణ పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్‌లో గ్రామ మాజీ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చీకట్ల వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల పాత్ర కీలకమని తెలిపారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ముసలయ్య, అనూసురి...

నేటి నుండి 31 వరకు ప్రమాద రహిత వారోత్సవాలు

Image
కాకినాడ :ఏపీఎస్ ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రమాద రహిత వారోత్సవాలు శనివారం నుంచి 31వ తేదీ వరకు జిల్లా లోని కాకినాడ,ఏలేశ్వరం, తుని డిపో లలో జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంయువి.మనోహర్ తెలియజేశారు. వారం రోజులపాటు డ్రైవర్ల అందరికీ ఆరోగ్య పరీక్షలు,రహదారి భద్రతా నియమాలపై శిక్షణా తరగతులు , ఉత్తమ డ్రైవర్స్ కు ప్రశంసా పత్రాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు.

ఘనంగా ముగిసిన హ్యాండ్ బాల్ పోటీ

Image
పెద్దాపురం..... పి ఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, పెద్దాపురంలో 24-07-2026 న హ్యాండ్ బాల్ రీజినల్ లెవెల్ పోటీ ఫైనల్స్ చాలా ఉత్సాహభరితంగా జరిగాయి అని విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీ యస్. సరత్చంద్ర కీర్తి గారు తెలియజేశారు. గత రెండు రోజులుగా 60 లీగ్ మ్యాచ్లు నిర్వహించారు. అందులో కోలార్, రాయచూరు, కరీంనగర్, పోలవరం, పాండిచ్చేరి, చిక్మంగళూరు,అల్లపి క్లస్టర్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నారు. 24-07-26 న జరిగిన ఫైనల్లో విన్నర్స్ అండర్ 14 మరియు 17; బాలురు విభాగంలో కోలార్ క్లస్టర్ , అండర్ 19 లో కరీంనగర్ క్లస్టర్ స్థానాన్ని కైవసం చేసుకోగా అండర్ 14 మరియు 17 బాలురు విభాగంలో పోలవరం క్లస్టర్, అండర్ 19 లో రాయచూరు క్లస్టరు రన్నర్స్ గా నిలిచారు. అండర్ 14 మరియు 17 బాలికలు విభాగంలో కోలార్ క్లస్టర్, అండర్ 19 లో పుదిచ్చెరి విన్నర్స్ స్థానాన్ని గెలుచుకున్నారు. అండర్ 19 మరియు 17 బాలికలు విభాగంలో చిక్మంగళూరు క్లస్టర్, అండర్ 14 లో అల్లపి క్లస్టర్స్ రన్నర్స్ గా నెగ్గారు అని పి యి టి సి హెచ్ జనార్దన్ నాయుడు తెలియజేశారు. ఈ పోటీలలో గెలుపొందిన టీమ్స్ నేషనల్ లెవెల్ లో ఆడేందుకు జలంధర్, పంజాబ్ ఆగస్టు 28 తేదీన జవహర్...

ముగిసిన కొవ్వూరు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు

Image
కాకినాడ : దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోని కొవ్వూరు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు శుక్రవారం ముగిశాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.శుక్రవారం కావడంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని దర్శనం చేసుకున్నారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చండీహోమం నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి సిహెచ్. శ్రీనివాస్ పూర్ణాహుతి సమర్పించారు.అమ్మవారికి ప్రీతిపాత్రమైన గుప్త నవరాత్రులు గురువారం రాత్రి ముగిశాయని తెలిపారు. ఆలయ సిబ్బంది ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదవితరణ గావించారు.

వారాహి ఆలయ ఘటనపై ఈవో శ్రీనివాస్ స్పందన.. ప్రచారంలో నిజం లేదన్న వివరణ

Image
కాకినాడ రూరల్ : కొవ్వూరు శ్రీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద మహిళలతో దేవాదాయ శాఖ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని ఆలయ ఈవో శ్రీనివాస్ ఖండించారు. భక్తుల రద్దీని నియంత్రించే సమయంలో జరిగిన ఘటనను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. గుప్త నవరాత్రుల సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో క్యూలైన్లను క్రమబద్ధీకరించే క్రమంలో జరిగిన చర్య మాత్రమేనని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆ సమయంలో పోలీసులు, సేవా సంఘాల ప్రతినిధులు కూడా విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ గుప్త నవరాత్రులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు. జూలై 15న ప్రారంభమైన వారాహి గుప్త నవరాత్రులు జూలై 25తో ముగియనున్నాయని వెల్లడించారు.

అతి తక్కువ సమయంలో తప్పుపోయిన బాలుడిని గుర్తించిన టూ టౌన్ పోలీస్

Image
  కాకినాడ జిల్లా : కాకినాడ కుళాయి చెరువు వద్ద ఉన్న భాను అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఆండ్రి ప్రసాద్ గారి భార్య శిరీష డెలివరీకి పుట్టింటికి వెళ్ళినట్లు, అతని 5 సం. ల పెద్ద కుమారుడు వికేత్ జోయ్ ఆశ్రమ పబ్లిక్ స్కూల్లో UKG చదువుచున్నట్లు, ది.07-07-2026 తేదీన బాలుడు స్కూల్ నుండి వచ్చిన తరువాత బాలుడుకి ఇంట్లో TV పెట్టి తండ్రి పని మీద బయటకు వెళ్ళినట్లు, ఇంట్లో TV చూస్తున్న బాలుడు రాత్రి సుమారు 7.45 గం.ల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లిపోయినట్లు, రాత్రి సుమారు 8 గం.లకు బాలుడి తండ్రి వచ్చి చూసుకుని వెంటనే కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా 2 టౌన్ ఇన్స్పెక్టర్ M.అప్పలనాయుడు గారు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 40 ని.లలోనే తప్పిపోయిన బాలుడిని ట్రేస్ చేసి తండ్రికి అప్పగించినారు. పిర్యాదు చేసిన వెంటనే స్పందించి తప్పిపోయిన బాలుడిని వెదికి పట్టుకుని అప్పగించినందుకు గాను అబ్బాయి కుటుంబ సభ్యులు 2 టౌన్ ఇన్స్పెక్టర్ M.అప్పలనాయుడు గారికి, కాకినాడ జిల్లా SP గారికి మరియు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసినారు. 2 టౌన్ ఇన్స్పెక్టర్ M.అప్పలనాయుడు గారిని వారి సిబ్బందిని కాక...

నేర రాజకీయాలను వైసిపి ప్రోత్సహిస్తుంది రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆరోపణ

Image
కాకినాడ రూరల్:   కాకినాడ రూరల్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. 'రావణ్' పేరుతో సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లను, హిందూ ధర్మాన్ని అవమానిస్తూ కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తికి వైఎస్సార్‌సీపీ నాయకత్వం పరోక్షంగా మద్దతు ఇస్తోందని, దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆరోపించారు. రాష్ట్రంలో నేర రాజకీయాలకు వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రోత్సాహం లభించిందని, సమాజాన్ని విభజించే శక్తులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వలసపాకల గంగరాజు నగర్‌లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ రెండో అధ్యాయం ప్రారంభమైందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మంది నాయకులు పార్టీలో చేరనున్నారని తెలిపారు. ప్రజల్లో మార్పు కోసం ఎదురుచూస్తున్న అనేక మంది జనసేన వైపు వస్తున్నారని పేర్కొన్నారు. 'రావణ్' పేరుతో సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లు, హిందూ ధర్మాన్ని అవమానిస్తూ కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ...