వాకలపూడిలో నూతన మార్కెట్ 23 దుకాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ

కాకినాడ రూరల్ :రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీ నిధులతో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన 23 వ్యక్తిగత దుకాణాలతో పాటు చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్‌ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వ్యాపారులకు మెరుగైన వాణిజ్య వసతులు కల్పించడంతో పాటు గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ నిర్మాణాల ద్వారా గ్రామ ఆర్థికాభివృద్ధి వేగవంతమవడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చిక్కాల రామచంద్రరావు, పితాని లీలా, నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, రంభాల వెంకటేశ్వరరావు, శిరంగు శ్రీనివాస్, తాటికాయల బుజ్జి, గంటా ప్రసాద్, గేదల చిన్నారావు, యజ్జల ప్రసాద్, మాత లక్ష్మణ్, చొక్కా జగన్, మంజు, ధనుష్, కుమారి, వెంకటేశ్వరరావు, కనిగిరి సత్యనారాయణ, కనీతి శ్రీనివాస్, జీని శ్రీనివాస్, సోదే ముసలయ్య, సునీల్, పండు, సతీష్, నూటన్ ఆనంద్, పైలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...