కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...
కాకినాడ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం కాకినాడలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాకినాడ నగరంలోని ఫ్యాబిన్ ఫంక్షన్ హాల్‌ను సందర్శించిన ఆయన, ఉప ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన సభా వేదిక, ప్రజల కూర్చునే ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వాహనాల పార్కింగ్ సదుపాయాలు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకుల సమన్వయ అంశాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ (కౌడా) ఛైర్మన్ తలాటం సత్య గారితో పాటు కూటమి పార్టీల నాయకులు, జనసేన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.


Comments
Post a Comment