రాజ సింహ అవార్డు అందుకున్న కరుణ్ రాజు

పిఠాపురం : పిఠాపురానికి చెందిన లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ టి. కామేశ్వరరావు (కరుణ్ రాజు)కి విశిష్ట సామాజిక సేవలకు ‘రాజ సింహ అవార్డు 2026 అందుకున్నారు.తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సమీపంలోని న్యూ గుండ్లవెల్లి, యాదగిరిగుట్టలోని కె.యం గ్రాండ్ హోటల్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం (జూలై 26) ఆదర్శ కళానిలయం సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులను ఈ సందర్భంగా సత్కరించి అవార్డులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పిఠాపురానికి చెందిన లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ టి. కామేశ్వరరావు (కరుణ్ రాజు)కి సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ప్రతిష్ఠాత్మకమైన రాజ సింహ అవార్డు–2026 ను ప్రదానం చేశారు.ఈ అవార్డును ప్రభుత్వ విప్, అలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆదర్శ కళానిలయం సంస్థ ఛైర్మన్ డాక్టర్ సి.హెచ్. ప్రకాశ్ తో పాటు పలువురు ప్రముఖులు చేతులు మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా టి.కామేశ్వర్రావు ( కరుణ్ రాజు ) మాట్లాడుతూ లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా విద్య, సామాజిక సేవ, ఇతర సేవా కార్యక్రమాల రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించి తనను రాజ సింహ అవార్డు–2026 కు ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా సమాజ అభ్యున్నతికి మరింత అంకితభావంతో సేవలు కొనసాగిస్తానని తెలిపారు.అలాగే ట్రస్ట్ నిర్వహిస్తున్న ప్రతి సేవా కార్యక్రమానికి ఆర్థికంగా, అన్ని విధాలుగా సహకరిస్తున్న దాతలు, సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ అవార్డు అందుకున్న సందర్భంగా పిఠాపురానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థల నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు టి.కామేశ్వర్రావు ( కరుణ్ రాజు ) ను అభినందిస్తూ, ఆయన సేవలు మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...