పిఠాపురం జనసేనలో సభ్యత్వం ఉన్నవారికి గుర్తింపు లేదా? రాజశేఖర్‌కు మద్దతుగా కార్యకర్తల ప్రశ్నలు! సభ్యత్వం ఉంటేనే పదవులు అన్న సిద్ధాంతం ఏమైంది? డాక్టర్‌కు పదవి కట్టబెట్టేందుకు అంత అత్యుత్సాహం ఎందుకు?
పిఠాపురం: జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలపై నమ్మకంతో పనిచేస్తున్న కార్యకర్తలకు పదవుల విషయంలో తగిన గుర్తింపు లభిస్తోందా? లేక కొత్తగా తెరపైకి వస్తున్న రాజకీయ సమీకరణాలకే ప్రాధాన్యం పెరుగుతోందా? పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కేంద్రంగా చేసుకుని ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తూ, సభ్యత్వంతో పార్టీతో అనుబంధం కొనసాగించిన సికోలు రాజశేఖర్‌కు చైర్మన్ పదవి దక్కాలనే డిమాండ్ ఆయన మద్దతుదారుల నుంచి వినిపిస్తోంది. ఒకప్పుడు పార్టీ సభ్యత్వం ఉన్నవారికే ప్రాధాన్యం, కష్టపడిన కార్యకర్తలకే పదవులు అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తున్నాయా? లేక అధికార, పదవుల సమీకరణాల్లో ఆ సిద్ధాంతాలు మరుగున పడుతున్నాయా? అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వం ఉందా లేదా అన్న అంశంపై స్పష్టత లేని వ్యక్తుల పేర్లు చైర్మన్ పదవి కోసం ప్రచారంలోకి రావడం, అలాంటి వారికి కొందరు ముఖ్య నాయకులు మద్దతు ఇస్తున్నారనే చర్చ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఓ వైద్యుడి విషయంలో ఒక నాయకుడు చూపిస్తున్న ప్రత్యేక ఆసక్...