పాఠశాల గేటు వద్దే చెట్టు దుంగలు.. విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు

పిఠాపురం : తుఫాను ధాటికి ఆర్‌ఎంబీ రహదారిపై విరిగిపడిన భారీ చెట్టును అధికారులు రోడ్డు నుంచి తాత్కాలికంగా తొలగించినప్పటికీ, దానికి సంబంధించిన కొమ్మలు, భారీ దుంగలను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన గేటు వద్దే వదిలేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ప్రవేశ మార్గంలోనే ఇవి పేరుకుపోవడంతో రోజూ బడికి వెళ్లే చిన్నారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిన్నారుల భద్రతను పక్కనపెట్టి, రోడ్డును మాత్రం శుభ్రం చేసి అధికారులు చేతులు దులుపుకోవడంపై గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న చెట్టును తొలగించిన అధికారులకు పాఠశాల గేటు వద్ద పడేసిన దుంగలను తొలగించాల్సిన బాధ్యత లేదా అని వారు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, పాఠశాల గేటు ముందున్న చెట్టు కొమ్మలు, దుంగలను తక్షణమే పూర్తిగా తొలగించి విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్ అండ్ బి రోడ్డు మీద పడినప్పటికీ ఫోటోలు

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ