Posts

Showing posts from September, 2026

వాకలపూడి జడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్‌గా మణికంఠ స్వామి

Image
కాకినాడ రూరల్,  :  కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కుండల మణికంఠ స్వామి ఎస్ఎంసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎన్నికల అధికారి, ఎంఈఓ-2 శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 280 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నికలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎంసీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్ఎంసీ సభ్యులుగా రామాల సూరిబాబు, వీర కుమారి, గోసాల కుమారి, గోసాల కాసు, బండి వసంతకుమారి, కొల్లుబోయిన సురేష్, కుమార్, భారతి, గోసాల చిన్నతల్లి, మండా దేవి, పక్కుర్తి శ్రీను, కొల్లుబోయిన అర్జున్, అమలదాసు దుర్గ, మాత లక్ష్మణరావు, పోలిశెట్టి సత్యనారాయణ, కోట సత్యవతి, బత్తుల సింహాచలం, గంటా భాస్కరరావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  అనంతరం సభ్యులంతా కలిసి మణికంఠ స్వామిని ఎస్ఎంసీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ మణికంఠ స్వామి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. విద్యార్థులకు మెరుగైన వ...

మహిళల స్వయం ఉపాధికి ఇదేనా ప్రోత్సాహం? — అన్నవరం కొండపై మహిళా వ్యాపారికి అడ్డంకులు... - కలెక్టర్‌కు ఫిర్యాదు

Image
కాకినాడ (అన్నవరం):  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎన్నో పథకాలు, తోడ్పాటు అందిస్తుంటే.. క్షేత్రస్థాయిలో ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్న ఒక మహిళకు మాత్రం తీవ్ర వేధింపులు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. కాకినాడ జిల్లా ప్రసిద్ధ అన్నవరం దేవస్థానం పడమట రాజగోపురం సమీపంలో షాప్ నిర్వహిస్తున్న సౌజన్య అనే మహిళా వ్యాపారిపై పక్క షాపుల నిర్వాహకులు సాగిస్తున్న గూండాగిరీ, దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  దేవస్థానం నిబంధనల ప్రకారం కొండపై ఆరు కొబ్బరికాయలు, ఆరు అరటిపండ్ల కాంబోను రూ.180 కే అమ్మాల్సి ఉండగా, పక్క షాపుల వారు ఏకంగా గత కొన్ని ఏళ్లుగా రూ.350 చొప్పున భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అక్రమాలను ప్రశ్నిస్తూ నిబంధనల ప్రకారమే విక్రయాలు జరుపుతున్న సౌజన్య షాపునకు భక్తులెవరూ వెళ్లకుండా పక్క షాపు వాడు తీవ్ర దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వాపోయారు. తన దుకాణాన్ని ముందుకు జరిపి, రోడ్డుపై మనుషులను నిలబెట్టి భక్తులను దారికాచి...

గుండె ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.......మెడ్‌వే సంజీవని ఆసుపత్రి ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ

Image
కాకినాడ :   ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కాకినాడలోని మెడ్‌వే సంజీవని ఆసుపత్రి ఆధ్వర్యంలో భారీ పాదయాత్రను విజయవంతంగా నిర్వహించారు. “ఆరోగ్యకరమైన గుండె – ఆరోగ్యకరమైన కుటుంబం – ఆరోగ్యకరమైన సమాజం” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ తలాటం సత్య, శాసనమండలి సభ్యుడు పేరాభత్తుల రాజశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర జిల్లా పరిషత్ కేంద్రం వరకు కొనసాగింది. అనంతరం ప్రజలకు అవగాహన కలిగించే విధంగా గుండె ఆగిపోయిన సమయంలో చేసే గుండె-ఊపిరితిత్తుల పునరుజ్జీవన ప్రక్రియను ఎలా చేయాలో వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు కర్రి పద్మశ్రీ, తలాటం సత్య, పేరాభత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఉరుకుల పరుగుల జీవితంలో పడి సంపాదనపైనే దృష్టి సారిస్తూ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శరీరంలో నిరంతరం పనిచేసే అత...

కూటమి అరాచకం.. మీడియాపై ఉక్కుపాదం

Image
• తప్పులు బయట పెడుతున్న మీడియాపై ఆంక్షలా? • “కిమ్” ను మించిపోయిన *చినబాబు రెడ్ బుక్* • హక్కుల కోసం ఉద్యోగుల పోరాటం తప్పా.. జమ్మలమడక సూటి ప్రశ్న కాకినాడ : రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఉత్తర కొరియా అధ్యక్షుడు *కిమ్* ను మించిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి. ఉద్యోగులు హక్కుల కోసం పోరాడుతుంటే వారిని పోలీసులతో అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానాలు సామాన్య ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాజ్యాంగ విరుధ్ధంగా జరుగుతున్న అక్రమాలు, అవినీతి పై నిబధ్ధతతో వార్తలు ప్రసారం చేస్తున్న పలు ఛానళ్ల గొంతు ప్రభుత్వం నొక్కేస్తోందని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్న ఆందోళనను కవర్ చేస్తున్న ఛానళ్లు ప్రసారాలను నిలిపివేయడం దుర్మార్గమని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కులను పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసారు. వారి హక్కులను కాలరాస్తే ప్రభుత్వాలను గతిని మార్చిన సంఘటలను సైతం కూటమి ప్రభుత్వం గుర్తెరగాలన్నారు. ప...

కొత్త డ్రైనేజీ నిర్మాణం.. సచివాలయానికే ‘మురుగు’ గండం

Image
స్వర్ణ' గ్రామంలో మురుగు కూపం..            పిఠాపురం :  గ్రామంలో కొత్త డ్రైనేజీ కాలువ నిర్మిస్తున్నామంటూ పంచాయతీ యంత్రాంగం చేస్తున్న పనులు స్థానిక ప్రజలకు తీవ్ర అప్పసోపాలు తెప్పిస్తున్నాయి. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో నూతన డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకుగానూ ఉన్న మురుగు కాలువను తవ్వుతున్నారు. అయితే, ఆ తవ్వకాల్లో బయటకు తీసిన పాత మురుగు వ్యర్థాలను, మట్టిని వేరే ప్రాంతానికి తరలించకుండా, నేరుగా గ్రామ సచివాలయం ఆవరణలోనే కుప్పలుగా పోస్తుండటంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రత పడకేసింది.. రోగాల భయం వెంటాడుతోంది! ప్రభుత్వ సేవలు పొందేందుకు నిత్యం వందలాది మంది వచ్చే సచివాలయ ప్రాంగణంలోనే మురుగు వ్యర్థాలు నిల్వ ఉండటంతో పరిసరాలన్నీ తీవ్ర అపరిశుభ్రంగా మారాయి. కుళ్ళిన వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసన భరించలేక సచివాలయానికి వచ్చే ప్రజలతో పాటు సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యర్థాల వల్ల దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయి, సచివాలయం చుట్టుపక్కల నివసించే కుటుంబాలకు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతు...

ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ చెత్త డంపింగ్...................‌ ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోని అధికారులు.. ప్రజా సమస్యల వేదికలో బాధితురాలి ఫిర్యాదు

Image
కాకినాడ: తమ ప్రైవేట్ స్థలాన్ని చెత్త డంపింగ్‌ యార్డుగా మార్చేశారని కాకినాడకు చెందిన పులపర్తి రాజ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. కొవ్వూరు వెళ్లే మార్గంలోని మేడ్‌లైన్‌ సమీపంలో ఉన్న తమ రెండు ఎకరాల స్థలంలో కార్పొరేషన్‌ మరియు కొవ్వూరు పంచాయతీ అధికారులు కొన్నేళ్లుగా చెత్తను డంపింగ్‌ చేస్తున్నారని తెలిపారు. గతంలో తమ స్థలంలో రైస్‌మిల్‌ నిర్వహించేవారని ఆ తర్వాత కార్యకలాపాలు నిలిచిపోవడంతో అధికారులు చెత్తను వేస్తూ డంపింగ్‌ యార్డుగా మార్చేశారని వాపోయారు. ఈ సమస్యపై సుమారు ఐదేళ్లుగా పంచాయతీ అధికారులకు మరియు జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు అర్జీలు సమర్పించినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త తమది కాదంటూ కార్పొరేషన్‌ మరియు పంచాయతీ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కరించాలని కోరితే చెత్తను మీరే తొలగించుకోవాలని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. జనావాసాల మధ్య చెత్తను డంపింగ్‌ చేయడం వల్ల వెలువడుతున్న దుర్వాసనతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహ...

ఏకగ్రీవంగా పవర్ డిప్లొమా ఇంజినీర్స్ నూతన కార్యవర్గం

Image
కాకినాడ జిల్లా : కాకినాడ సర్కిల్ ఏపీ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని ఐఎంఏ హాల్‌లో నిర్వహించిన సర్కిల్ జనరల్ బాడీ సమావేశంలో జరిగాయి. 2027 నుంచి 2028 పదవీకాలానికి జరిగిన ఈ ఎన్నికలకు ఎ వీరభద్రరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి జనరల్ పి సన్యాసిరావు డిస్కామ్ యూనిట్ జనరల్ సెక్రటరీ జి జోగి నాయుడు తదితరులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా కాకినాడ సర్కిల్ యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్కిల్ అధ్యక్షులుగా ఎ వీరభద్రరావు కాకినాడ అర్బన్ ఏడీఈఓగా సర్కిల్ కార్యదర్శిగా గౌతు రాజు రామనయ్యపేట ఏఈగా సర్కిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం శ్రీనివాస్ యు కొత్తపల్లి ఏఈఓగా మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చ వాసవి ఇంద్రపాలెం జేఈగా సర్కిల్ కోశాధికారిగా వి సుబ్బారావు శాంతినగర్ జేఈఓగా ఎన్నికయ్యారు.  నూతన కార్యవర్గానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జివిఎల్ఎన్ శ్రీనివాస్ ఈఈ ఎన్ ఉదయ్ భాస్కర్ సూపరింటెండెంట్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఈఈ శ్రీనివాస్‌ను పూలమాలతో ఘ...

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ సానా, ఎమ్మెల్యే పంతం

Image
కరప మండలం : కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం విజయరాయుడుపాలెం గ్రామంలో ముంపునకు గురైన పంట పొలాలను కాకినాడ ఎంపీ సాన సతీష్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శనివారం పరిశీలించారు. గత నాలుగు రోజులుగా ముంపునీటిలోనే ఉన్న వరి దుబ్బులను రైతులు వారికి చూపించి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రైతు ముద్రగడ గోవిందరాజులు మాట్లాడుతూ రొయ్యల చెరువుల కారణంగా ఈ ప్రాంతంలో ముంపు సమస్య ఏర్పడుతోందని తెలిపారు. వెంటనే మురుగు నీటి డ్రైనేజీలను శుభ్రం చేసి, ముంపునీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం వేములవాడ సిరిగిరిపల్లి లంకలో నూతనంగా నిర్మించిన రహదారులను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎమ్మెల్యే నానాజీ సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు...

గంటల వ్యవధిలోనే మరణ ధ్రువీకరణ పత్రం అందజేత

Image
కాకినాడ జిల్లా .... సామర్లకోట పట్టణంలో ఒక వ్యక్తి మరణించిన గంటల వ్యవధిలోనే మరణ ధ్రువీకరణ పత్రాన్ని మున్సిపల్ అధికారులు అందజేశారు. పురపాలక సంఘము పరిధిలో మణుగలదిబ్బ సచివాలయం పరిధిలో అనసూరి రాజా రమేష్ తండ్రి అనసూరి అప్పారావు శనివారం  స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న  గంటల వ్యవధిలోనే మున్సిపల్ ఏఎస్ఓ హెల్త్ అసిస్టెంట్ లు ఆయన మృతిపై పరిశీలన జరిపి   గంటల వ్యవధిలోనే మరణ ధ్రువీకరణ పత్రం కుటుంభానికి అందజేశారు.   పురపాలక ప్రజలకు సేవలు అందజేయడంలో ముందు ఉంటామని ఈ సందర్బంగా మున్సిపల్ కమీషనర్ నామ కనకరావు తెలిపారు.

ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా 43 మంది పోలీసులకు ఘన సన్మానం

Image
కాకినాడ జిల్లా :  శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, వారిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) నాయకులు కొనియాడారు. అంతర్జాతీయ ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని MPJ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్‌లో ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ ఎం. కిషోర్ కుమార్, డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ బి.వి. శ్రీహరి రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాకినాడ పరిధిలోని 15 పోలీసు స్టేషన్ల నుంచి విధి నిర్వహణలో విశేష ప్రతిభ, అంకితభావం కనబరిచిన 43 మంది పోలీసు సిబ్బందిని ఎంపిక చేసి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.సన్మానం పొందిన వారిలో 13 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు (CIలు), 10 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు (SIలు), 5 మంది అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ASIలు), 15 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ సందర్భంగా MPJ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ హలీమ్, రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ సభ్యుడు హుస్సేన్, టౌన్ ప్రెసిడెంట్ షబ్బీర్ జానీ మాట్లాడుతూ ...

పోలీసులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా విధులు నిర్వహించాలి.....రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

Image
క్రమశిక్షణ, సేవా దృక్పథంతో ప్రజలకు భద్రత కల్పించాలి 280 మంది పోలీస్ కానిస్టేబుళ్ల దీక్షాంత పరేడ్‌లో పాల్గొన్న మంత్రి సుభాష్ కాకినాడ జిల్లా : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 3వ బెటాలియన్, కాకినాడలో 2025-26 బ్యాచ్ రెండో బేసిక్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్ (SCTPC) దీక్షాంత పరేడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై పరేడ్‌ను పరిశీలించి సెల్యూట్ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ తొమ్మిది నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 280 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అంకితమయ్యే గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీసు సిబ్బంది నిజాయితీ, క్రమశిక్షణ, సేవా భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న విలువలు, నైపుణ్యాలు భవిష్యత్ స...

అక్టోబర్ 1న కత్తిపూడి సీతారామ జూనియర్ కాలేజ్ నందు మెగా జాబ్ మేళా...

Image
కాకినాడ జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపునాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచే ఉద్దేశ్యంతో 01-10-2026 వ తారీకున కాకినాడ జిల్లా లో ఉన్న ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న కత్తిపూడి లో సీతారామ జూనియర్ కాలేజ్, నందు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటి ద్వారా అభ్యర్ధుల విద్యార్హత మరియు నైపుణ్యాలకు అనుగుణం గా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు... ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికిసంబంధించిన అవగాహన గోడ పత్రికలను కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎం.ఎస్. హరేంధిర ప్రసాద్, IAS గారు చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న కత్తిపూడి లోసీతారామ జూనియర్ కాలేజ్, కత్తిపూడి నందు జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని, ఆసక్తి మరియు అర్హత ఉన్న ప్రతి నిరుద్యోగి ఉదయం 09:00 గంటల కల్లా ప్రాంగణ స్థలానికి వచ్చి ఉపయోగించుకోవాలని తెలిప...

తుఫాన్ బీభత్సం.. రోడ్డుపై కూలిన భారీ చింతచెట్టు

Image
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో తుఫాన్ బీభత్సం నెలకొంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో భారీ చింతచెట్టు ఒక్కసారిగా పిఠాపురం–సామర్లకోట ప్రధాన రహదారిపై కూలిపోయింది. చెట్టు విద్యుత్ వైర్లపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారిపై చెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. చెట్టు కూలిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తుఫాన్ ప్రభావంతో భారీ చెట్టు రోడ్డుపై కూలడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

కాకినాడ మెడికవర్ లో నూతన క్యాన్సర్ వింగ్ ప్రారంభం

Image
కాకినాడలో క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ నూతన క్యాన్సర్ వింగ్‌ను ఘనంగా ప్రారంభించింది. పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ముఖ్య అతిథిగా హాజరై నూతన క్యాన్సర్ వింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మాట్లాడుతూ కాకినాడలో ఆధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మెడికవర్ హాస్పిటల్స్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్యక్రమానికి లయన్ చిట్నీడి శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ గవర్నర్, జనసేన పార్టీ నాయకుడు దుగ్గన బాబ్జీ తదితరులు హాజరయ్యారు. నూతన క్యాన్సర్ వింగ్‌ను సందర్శించిన వారు ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ ఎన్. అంజిబాబు మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణ నుంచి చికిత్స వరకు అవసరమైన సమగ్ర వైద్య సేవలను ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో నూతన క్యాన్సర్ వింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిపుణులైన వైద్యుల సమన్వయంతో రోగులకు చికిత్స అ...

అనపాల సేవా ప్రస్థానానికి మలేషియా ముద్ర

Image
ఆంధ్రప్రదేశ్ : కాకినాడ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు అనపాల ఆంజనేయులు రెడ్డికి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. సమాజ సేవలో ఆయన చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా మలేషియా గ్లోబల్ ఇన్స్పిరేషన్–2026 అంతర్జాతీయ అవార్డును ప్రదానం చేశారు.  మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సంఘం కార్యాలయంలో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుడు అద్దంకి రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ పి. త్రివిక్రమరావు చేతుల మీదుగా అనపాల ఆంజనేయులు రెడ్డికి మలేషియా గ్లోబల్ ఇన్స్పిరేషన్–2026 అంతర్జాతీయ పురస్కారాన్ని అందజేశారు. సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషితో పాటు పేదల సంక్షేమం విద్య ఆరోగ్యం మానవతా సేవలు మరియు సామాజిక కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనపాల ఆంజనేయులు రెడ్డి సేవా కార్యక్రమాలు యువతతో పాటు వృద్ధులు స్వచ్ఛంద సంస్థలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా అనపాల ఆం...

డ్రగ్స్ వద్దు బ్రో.. విద్యార్థులకు అవగాహన

Image
పిఠాపురం  : ఆర్.ఆర్.బి.హెచ్. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డి.ఆర్.కె. రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.  గంజాయి, మత్తు పదార్థాలు, ఇతర మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.  డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు తమ దృష్టికి వస్తే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదం చేయించారు.  కార్యక్రమంలో ఈగల్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫిర్యాదులు పరిష్కారం కానప్పుడు పాడా కార్యాలయం ఎందుకు పాడా బోర్డు తీసి జనసేన బోర్డు పెట్టుకోండి..

Image
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చేసిన సర్వే నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, దళిత సంఘాల నాయకులు బుధవారం పాడా కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు చేస్తున్న వారిని అధికారులు శత్రువులుగా చూస్తున్నారని వారు ఆరోపించారు.  ఈ సందర్భంగా రామకృష్ణ ఏసుదాసు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వద్ద ఫిర్యాదు చేసినప్పటికీ సర్వే, నిర్ధారణ పూర్తికాకముందే అక్రమణదారులు పెన్సింగ్ వేయడం దారుణమన్నారు. జగయ్యచెరువు సర్వే రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలను అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలతో సర్వే నిర్వహిస్తామని పాడా పీడీ ప్రకటించారని, ఆ సర్వే వివరాలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా ముఖం చాటేయడం సరికాదన్నారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. భూ, ఇసుక, మైనింగ్, రేషన్, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వీటిపై ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధిలైట్లు లేకపోవడం, డ్రైనేజీల్లో మురు...

గ్రూప్ - 1 నియామకాల్లో భారీ కుంభకోణం: సుంకర పావని

Image
కాకినాడ సిటీ : వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల్లో చరిత్రలో లేనివిధంగా భారీ అవకతవకలు, అవినీతి జరిగాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ ఆరోపించారు. గ్రూప్-1 నియామకాలకు సంబంధించి సిట్ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు.  2018 డిసెంబర్ 31న జారీ చేసిన నోటిఫికేషన్ నుంచి నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అభ్యర్థులను సామూహికంగా మోసం చేసేలా వ్యవహారం సాగిందని పావని ఆరోపించారు. ఏపీపీఎస్సీ జవాబు పత్రాలను మూడుసార్లు ఎందుకు మూల్యాంకనం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 87 మంది అభ్యర్థుల మూల్యాంకన స్లిప్పుల్లో చీఫ్ ఎగ్జామినర్ సంతకాలలో దిద్దుబాట్లు ఎందుకు జరిగాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు డిజిటల్ మూల్యాంకనం బాధ్యతలు ఎందుకు అప్పగించారో చెప్పాలని పావని ప్రశ్నించారు. డిజిటల్, మాన్యువల్ మూల్యాంకనాల్లో మార్కుల తేడాలు ఎందుకు వచ్చాయో స్పష్టం చేయాలన్నారు. కోర్టు ఆదేశాలతో హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనంలో ఒరిజినల...

కేబుల్ న్యూస్ చానళ్ల కేంద్రాల్లో అక్రిడిటేషన్ కమిటీ తనిఖీలు

Image
కాకినాడ  :: జిల్లాలోని వివిధ కేబుల్ న్యూస్ చానళ్ల నిర్వహణ, ప్రసార వ్యవస్థలు, మౌలిక వసతులపై అక్రిడిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ హరేందిర ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు జిల్లాలోని వివిధ న్యూస్ నెట్‌వర్క్ కేంద్రాలను సందర్శించి అక్కడి ప్రసార వ్యవస్థను పరిశీలించారు. ముఖ్యంగా ఆయా సంస్థల్లో ఏర్పాటు చేసిన స్టూడియో, సర్వర్ రూమ్, టెలికాస్టింగ్ విభాగాలు, ప్రసార సాంకేతిక పరికరాలు, కార్యాలయ మౌలిక వసతులు తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. న్యూస్ చానళ్ల నిర్వహణకు సంబంధించి అందుబాటులో ఉన్న సాంకేతిక సదుపాయాలు, ప్రసార కార్యకలాపాల నిర్వహణ విధానం, స్టూడియోలోని ఏర్పాట్లు, సర్వర్ రూమ్‌లోని సాంకేతిక వ్యవస్థ, టెలికాస్టింగ్‌కు సంబంధించిన పరికరాలు తదితర అంశాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. సంబంధిత వివరాలను నమోదు చేసుకుని, నిబంధనల మేరకు వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించారు. ఈ తనిఖీల కార్యక్రమంలో సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి. పద్మజ పాల్గొని, వివిధ న్యూస్ నెట్‌వర్క...

రాజధాని పవర్ ప్రైవేట్ పరం.. కూటమి ప్రభుత్వంపై నాగమణి విమర్శలు

Image
కాకినాడ: రాజధాని ప్రాంతంలో విద్యుత్ పంపిణీ, రిటైల్ సరఫరాను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం యోచిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలపై అదనపు భారాన్ని మోపే ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి టెండర్లు ఆహ్వానించడం చూస్తుంటే ఇప్పటికే ఈ వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో విద్యుత్ నెట్‌వర్క్ అభివృద్ధి, ఆపరేషన్స్, నిర్వహణ, బిల్లింగ్, కలెక్షన్ వంటి బాధ్యతలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్‌లో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నాగమణి పేర్కొన్నారు. డొమెస్టిక్, కమర్షియల్, ప్రభుత్వ రంగాలకు విద్యుత్ పంపిణీ ప్రైవేట్ సంస్థల ఆధీనంలోకి వెళితే సామాన్యులు, వ్యాపారులు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. చంద్రబాబు నాలుగు దఫాల పాలనలో కీలకమైన వ్యవస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానం కొనసాగుతోందని...

తూరంగిలో అధికారుల పర్యవేక్షణ కరువు.. రోడ్డుపై గోతులు తీసి అక్రమ కుళాయి కనెక్షన్లు

Image
కాకినాడ రూరల్ .....మండలం పరిధి తూరంగి గ్రామంలో అధికారులతో పనిలేకుండా ఎవరి ఇష్టానుసారం వారు పనిచేసుకుని పోతుంటే చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. తూరంగి మహాలక్ష్మీ నగర్‌లో కొంతమంది స్థానికులు అధికారులకు తెలియ పర్చకుండా రోడ్డుమద్యలో గుంతలు తవ్వి కుళాయి కనెక్షన్లు వారికి వారే వేసుకుని గుంతలు పూడ్చకుండా వదిలేయడంతో అటువైపుగా వెళ్ళే ప్రయాణికులు అందులో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీనిపై కాకినాడ రూరల్ మండల అభివృద్ది కార్యాలయంలో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో తూరంగి మాజీ ఎంపిటిసి పితాని రాము పిర్యాదు చేసినా ఇప్పటివరకు ఏ అధికారి పట్టించుకున్న చర్యలు కనిపించలేదు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ కాకినాడ మున్సిపాల్టీకి సంబందించిన కుళాయి గొట్టాలను పంచాయితీలో ఉండే స్థానికులు రంద్రాలు పెట్టి అనధికారికంగా కుళాయి కనెక్షన్లను వేసుకుంటున్నారన్నారు. కనీసం తవ్విన గొయ్యలను కూడా పూడ్చడం లేదని, దీంతో అటువైపుగా ప్రయాణం చేసే వారు రాత్రి వేళలో ప్రమాదానికి గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా పంచాయితీ, మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు ...

ఫిజియోథెరపీతో ఆరోగ్యకరమైన జీవనశైలి...మెడ్‌వే సంజీవి ఆసుపత్రిలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం

Image
కాకినాడ... ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడ్‌వే సంజీవి ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు తెలిపారు. యూనిట్ హెడ్ ఆర్. దినేష్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శారీరక చలనం, వ్యాయామం, పునరావాస చికిత్స ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించడంతో పాటు జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని వివరించారు. ‘‘జీవితానికి చలనం – అందరికీ ఆరోగ్యం’’ అనే సందేశంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని ఆసుపత్రి సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు.

అక్రమంగా అరెస్ట్ చేసిన నంద్యాల ఐ న్యూస్ జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలి : APJF

Image
కాకినాడ : రాష్ట్ర మంత్రి ఫరూఖ్ కుమారులపై ఐ న్యూస్ చానల్ లో కథనం ప్రసారం చేసిన నంద్యాల రిపోర్టర్స్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కాకినాడ జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు, APJF నాయకులు వీధి సాయినాథ్, రెడ్డిపల్లి రాజేశ్ తీవ్రంగా ఖండించారు. నంద్యాలలో జరుగుతున్న విషయాలను వెలుగులోకి తీసుకువస్తు ఐ న్యూస్ రిపోర్టర్స్ ప్రసారం చేసిన అంశాలలో అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయవచ్చని అయితే అందుకు విరుద్ధంగా జర్నలిస్టులపై దాడులకు బెదిరింపులకు తెగబడటం దారుణం అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియా వ్యవస్థ లోని లోపాలను వెలుగులోకి తీసుకువచ్చినప్పుడు సరైన రీతిలో స్పందించక పోగా ఇటువంటి చర్యలకు పాల్పడటాన్నీ తప్పుపట్టారు. నచ్చని వార్తలపై ఖండన ఇవ్వొచ్చని, ఆధారాలు లేకుంటే పరువునష్టం దావా కూడా వేయొచ్చనీ అన్నారు. అలా కాకుండా అధికార పార్టీ నేతల అండతోనే వార్తలు ప్రసారం చేసిన జర్నలిస్టులుపై అన్యాయంగా కేసులు పెట్టి అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని ఇప్పటి వరకు అరెస్ట్ చూపించక పోవడం సిగ్గు చేటనీ ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డీజీపీ వెంటనే స్పందించి అరెస్ట్ చేసిన జర్నలిస్టులను బేషరత...

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు పిఠాపురం ఆర్చర్స్ ఎంపిక

Image
పిఠాపురం: రాజమహేంద్రవరంలో ఈనెల 6న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్చరీ పోటీల్లో పిఠాపురానికి చెందిన 10 మంది క్రీడాకారులు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జే. ఐశ్వర్య, బి. జైదీప్ స్వర్ణ పతకాలు సాధించగా, జే. అరుణ్, పి. లోకేష్ రజత పతకాలు సాధించారు. కే. హరిణి, లాస్య, యశస్విన్, తరుణ్, అమీదా, అలీ కాంస్య పతకాలు సాధించారు. వీరంతా జూనియర్ విభాగంలో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున పాల్గొననున్నారు. సీనియర్ విభాగంలో ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 4 నుంచి 7వ తేదీ వరకు భీమవరంలో జరగనున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొంటారని పిఠాపురం ఆర్చరీ కోచ్‌లు పి. కృష్ణ, లక్ష్మణరావు తెలిపారు.

కాకినాడ జిల్లా రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షుడిగా రామకృష్ణ

Image
కాకినాడ జిల్లా.... రైస్ మిల్లు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికయింది అధ్యక్షుడిగా రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కాకినాడలోని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో జరిగిన సమావేశంలో హాజరైన సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామకృష్ణ ఉపాధ్యక్షులుగా పేకేటి నాగేశ్వరరావు, కొయ్య శ్రీనుబాబు, సంయుక్త కార్యదర్శిగా కొత్త బైరవకృష్ణ, కోశాధికారిగా పెద్దిరెడ్డి రామాంజనేయ (బాబి)తో కూడిన కార్యవర్గాన్ని సుమారు 123 మంది సభ్యుల హాజరై ఎన్నుకొన్నారు.  ఈ సందర్భంగా అధ్యక్షడు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థకు పంపిణీ చేసే బియ్యాన్ని జిల్లా నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక అవడం ఆనందంగా ఉందన్నారు. కాకినాడ పోర్టులో ఎటువంటి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందన్నారు. ఒకరిద్దరు చేస్తున్న తప్పుల వల్ల అసోసియేషన్లోని మిల్లర్ల పైన తప్పుడు సంకేతం వెళ్తుందన్నారు. పోర్టులో బొండం బియ్యం, పచ్చి నూకలు మాత్రమే మాత్రమే ఎగుమతి జరుగుతున్నాయని చెప్పారు. మిల్లర్ల సంక్షేమానికి తన వంతు ఎనలేని కృషి చేస్తానని రామకృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా రామకృష్ణను పలువురు ...

ఉల్లి షాపులు మూత.. కాకినాడ రైతు బజార్‌లో ఏం జరుగుతోంది?

Image
కాకినాడ జిల్లా ...కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని రైతు బజార్‌లో ఉల్లి విక్రయాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకూ ఉల్లి ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్న వేళ.. రైతు బజార్‌లో ఉల్లి విక్రయించే షాపులు తెరవకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్టాక్‌ ఉన్నప్పటికీ ప్రజలకు ఉల్లి ఎందుకు అందడం లేదు? షాపులు ఎందుకు మూసి ఉన్నాయి? ఉల్లి ధర మరింత పెరుగుతుందనే ఆశతో కావాలనే విక్రయాలు నిలిపివేశారా? గత రెండు రోజులుగా ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉండాల్సిన రైతు బజార్‌లోనే ప్రజలకు ఉల్లి అందుబాటులో లేకపోవడం దేనికి సంకేతం? ప్రజలకు ఉల్లి అందించాల్సిన బాధ్యత ఎవరిది? స్టాక్‌ ఉన్నా అమ్మకాలు ఎందుకు జరగడం లేదు? షాపులు మూసి ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించలేదా? సామాన్యుడి వంటింట్లో ఉల్లి ధరల మంట మండుతుంటే.. కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌ రైతు బజార్‌లో జరుగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు ఎప్పుడు నోరు విప్పుతారు? ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు?

తుమ్మల బాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Image
కాకినాడ జిల్లా..  జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వెయ్యి ద్విచక్ర వాహనాలతో పిఠాపురానికి జనశ్రేణి తరలివెళ్లారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ జనసేన నాయకులు, యువత, కార్యకర్తలు భారీ సంఖ్యలో పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరారు. సామర్లకోట పట్టణంలోని ప్రత్తిపాడు సెంటర్ వద్ద తుమ్మల రామస్వామి జెండా ఊపి బైక్ ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. అనంతరం జి. రాగంపేట, వడ్లమూరు, గోరింట, పులిమేరు, దివిలి గ్రామాల మీదుగా విరవ, విరవాడ గ్రామాల మీదుగా ర్యాలీ కొనసాగి పిఠాపురంలోని ఆర్ఆర్బీ హెచ్ఆర్ గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుంది. జనసేన జెండాలతో అలంకరించిన వాహనాలు, నినాదాలతో ర్యాలీ సాగడంతో మార్గమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా డిసిసిబి తుమ్మల రామస్వామి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద పండుగలా నిర్వహ...

ప్రజల హృదయాల్లో వైయస్ ది చెరగని ముద్ర.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి

Image
  కాకినాడ జిల్లా . మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన అందించిన పథకాలు, ఆత్మీయత రూపంలో ప్రజల మధ్య ఎప్పటికీ చిరస్థాయిగానే ఉంటారని,ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని వైఎస్ఆర్సిపి కాకినాడ సిటీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ వర్ధంతి సందర్భంగా స్థానిక బాలాజీ చెరువు సెంటర్లోని ఆయన కాంస్య  విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి , పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజల గుండెల్లో వైయస్ సుస్థిర స్థానం సంపాదించారన్నారు. వైయస్ అమలు చేసిన పథకాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచాయని, ప్రపంచమంతా ఆయన పరిపాలన తీరును ఎంతగానో ప్రశంసించిందన్నారు. వైయస్ అడుగుజాడల్లో జాడల్లో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. వైయస్సార్ తో తనకు గల అనుబంధాన్ని ఆయన జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న, రాష్ట్ర మహిళా ప్...

కుమారపురంలో రక్తదాన శిబిరం.. పవన్‌ కళ్యాణ్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జన సైనికులు

Image
పిఠాపురం ::  జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని కుమారపురం గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికులు ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ అభయ బ్లడ్‌ సెంటర్‌ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి గ్రామ యువత, జనసైనికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పవన్‌ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమాజానికి సేవ చేయాలనే ఆయన ఆలోచనలు, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపుతున్న చొరవ తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌, ముఖ్య అతిథులుగా పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్‌తో పాటు అతిథులుగా నియోజకవర్గ జనసేన నాయకులు వెన్న జగదీష్‌, వుటా నానిబాబు, తోలేటి శిరీష, పెంకె జగదీష్‌, జి గో...