అనపాల సేవా ప్రస్థానానికి మలేషియా ముద్ర

ఆంధ్రప్రదేశ్ : కాకినాడ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు అనపాల ఆంజనేయులు రెడ్డికి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. సమాజ సేవలో ఆయన చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా మలేషియా గ్లోబల్ ఇన్స్పిరేషన్–2026 అంతర్జాతీయ అవార్డును ప్రదానం చేశారు. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సంఘం కార్యాలయంలో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుడు అద్దంకి రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ పి. త్రివిక్రమరావు చేతుల మీదుగా అనపాల ఆంజనేయులు రెడ్డికి మలేషియా గ్లోబల్ ఇన్స్పిరేషన్–2026 అంతర్జాతీయ పురస్కారాన్ని అందజేశారు.సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషితో పాటు పేదల సంక్షేమం విద్య ఆరోగ్యం మానవతా సేవలు మరియు సామాజిక కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనపాల ఆంజనేయులు రెడ్డి సేవా కార్యక్రమాలు యువతతో పాటు వృద్ధులు స్వచ్ఛంద సంస్థలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనపాల ఆంజనేయులు రెడ్డి మాట్లాడుతూ ఈ గౌరవం తన ఒక్కరిదే కాదని తనతో కలిసి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన స్వచ్ఛంద సంస్థలు సేవాభిమానులు మరియు శ్రేయోభిలాషులందరికీ చెందుతుందని తెలిపారు. స్వామి వివేకానంద జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన ఆశయాలను ఆచరించాలని ముఖ్యంగా యువత సమాజ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అద్దంకి రాజా మాట్లాడుతూ గత వారం మలేషియాలో ప్రవాస తెలుగు సంఘం సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అనివార్య కారణాల వల్ల అక్కడికి హాజరు కాలేకపోయిన వారికి మంగళగిరిలో అవార్డులు అందజేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.కార్యక్రమంలో రాజకీయ విద్యా సాంస్కృతిక సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రీశ్రీ కళావేదిక జాతీయ సహాయ కార్యదర్శి గొట్టుముక్కల నాసరయ్య సాహితీవేత్తలు మరియు సామాజికవేత్తలు పాల్గొని అనపాల ఆంజనేయులు రెడ్డికి అభినందనలు తెలిపారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ