కూటమి అరాచకం.. మీడియాపై ఉక్కుపాదం
• “కిమ్” ను మించిపోయిన *చినబాబు రెడ్ బుక్*
• హక్కుల కోసం ఉద్యోగుల పోరాటం తప్పా.. జమ్మలమడక సూటి ప్రశ్న
కాకినాడ : రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఉత్తర కొరియా అధ్యక్షుడు *కిమ్* ను మించిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి. ఉద్యోగులు హక్కుల కోసం పోరాడుతుంటే వారిని పోలీసులతో అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానాలు సామాన్య ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాజ్యాంగ విరుధ్ధంగా జరుగుతున్న అక్రమాలు, అవినీతి పై నిబధ్ధతతో వార్తలు ప్రసారం చేస్తున్న పలు ఛానళ్ల గొంతు ప్రభుత్వం నొక్కేస్తోందని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్న ఆందోళనను కవర్ చేస్తున్న ఛానళ్లు ప్రసారాలను నిలిపివేయడం దుర్మార్గమని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కులను పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసారు. వారి హక్కులను కాలరాస్తే ప్రభుత్వాలను గతిని మార్చిన సంఘటలను సైతం కూటమి ప్రభుత్వం గుర్తెరగాలన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలను ఎత్తి చూపిస్తున్న మీడియాను అణచి వేయడం వల్ల ప్రజలకు నిజం తెలియదని భావించడం సరికాదన్నారు.కేబుల్ ఆపరేటర్లను భయభ్రాంతులకు గురి చేసి తమ గుప్పెట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టల్లా ఆడిస్తున్నారని మండిపడ్డారు. ఇది చాలదన్నట్టు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లకు సొమ్ములను ఎరగా వేస్తున్నారని తెలిపారు. ప్రధాన మీడియా ఛానళ్లకు మైనింగ్, కాంట్రాక్టులు ఎరగా వేసి, వ్యతిరేకంగా ఉన్న మీడియాను అణచి వేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదరువుతోందని వ్యాఖ్యనించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి కూడా లేకుండా మీడియాను నియంత్రించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. చివరికి ప్రకృతి విపత్తులు, తుఫాన్లకు సంబంధించిన వార్తల ప్రసారం పైనా ఆంక్షలు విధించే దుస్థితికి ప్రభుత్వం దిగజారడం సిగ్గు చేటన్నారు. చినుకు పడితే భయం, వరదొస్తే భయం, గాలి వీచినా భయపడే ప్రభుత్వం ఇక ప్రజలు ఏం మంచి చేస్తుందని భావించాలో తెలియడం లేదన్నారు. మీడియాలో వచ్చే కథనాలను చూసి ప్రజల అవసరాలను తీర్చే రోజుల నుంచి, అసత్యాలను ప్రసారం చేయించుకునే స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారిపోవడం దురదృష్టకరమన్నారు. అరచేతితో సూర్యిడిన అడ్డుకోలేరన్నది ఎంత నిజమే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని ప్రజలకు చేరకుండా ఆపలేదరన్నది అంతే నిజం అని కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో ప్రతీ అంశం క్షణాల్లో ప్రజలకు చేరుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే సమయం దగ్గరలోనే ఉందన్నారు జమ్మలమడక నాగమణి..
Comments
Post a Comment