తూరంగిలో అధికారుల పర్యవేక్షణ కరువు.. రోడ్డుపై గోతులు తీసి అక్రమ కుళాయి కనెక్షన్లు

కాకినాడ రూరల్.....మండలం పరిధి తూరంగి గ్రామంలో అధికారులతో పనిలేకుండా ఎవరి ఇష్టానుసారం వారు పనిచేసుకుని పోతుంటే చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. తూరంగి మహాలక్ష్మీ నగర్‌లో కొంతమంది స్థానికులు అధికారులకు తెలియ పర్చకుండా రోడ్డుమద్యలో గుంతలు తవ్వి కుళాయి కనెక్షన్లు వారికి వారే వేసుకుని గుంతలు పూడ్చకుండా వదిలేయడంతో అటువైపుగా వెళ్ళే ప్రయాణికులు అందులో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీనిపై కాకినాడ రూరల్ మండల అభివృద్ది కార్యాలయంలో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో తూరంగి మాజీ ఎంపిటిసి పితాని రాము పిర్యాదు చేసినా ఇప్పటివరకు ఏ అధికారి పట్టించుకున్న చర్యలు కనిపించలేదు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ కాకినాడ మున్సిపాల్టీకి సంబందించిన కుళాయి గొట్టాలను పంచాయితీలో ఉండే స్థానికులు రంద్రాలు పెట్టి అనధికారికంగా కుళాయి కనెక్షన్లను వేసుకుంటున్నారన్నారు. కనీసం తవ్విన గొయ్యలను కూడా పూడ్చడం లేదని, దీంతో అటువైపుగా ప్రయాణం చేసే వారు రాత్రి వేళలో ప్రమాదానికి గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా పంచాయితీ, మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని పితాని రాము కోరారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ