అక్టోబర్ 1న కత్తిపూడి సీతారామ జూనియర్ కాలేజ్ నందు మెగా జాబ్ మేళా...
కాకినాడ జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపునాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచే ఉద్దేశ్యంతో 01-10-2026 వ తారీకున కాకినాడ జిల్లా లో ఉన్న ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న కత్తిపూడి లో సీతారామ జూనియర్ కాలేజ్, నందు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటి ద్వారా అభ్యర్ధుల విద్యార్హత మరియు నైపుణ్యాలకు అనుగుణం గా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు...
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికిసంబంధించిన అవగాహన గోడ పత్రికలను కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎం.ఎస్. హరేంధిర ప్రసాద్, IAS గారు చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...
ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న కత్తిపూడి లోసీతారామ జూనియర్ కాలేజ్, కత్తిపూడి నందు జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని, ఆసక్తి మరియు అర్హత ఉన్న ప్రతి నిరుద్యోగి ఉదయం 09:00 గంటల కల్లా ప్రాంగణ స్థలానికి వచ్చి ఉపయోగించుకోవాలని తెలిపారు.
ఇందులో భాగంగా ఎస్ఎస్ సి,ఇంటర్, డిప్లొమా, ఐటిఐ, ఏని డిగ్రీ, బీటెక్ మరియు ఎంబిఏ, బిఫార్మసీ & ఎం ఫార్మసీ అభ్యర్ధుల నుంచి ధరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని...కావున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు అందరూ వినియోగించు కోవాలని కోరుచున్నము.
మరిన్ని వివరాలకు క్రింద పొందుపరిచిన నంబర్లకు కాల్ చేయగలరు.
8247788247, 9949500473, 8500885866
రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింది ఇవ్వబడిన నైపుణ్యం పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవలెను.
https://naipunyam.ap.gov.in
ఈ గోడ పత్రికల ఆవిష్కరణ లో కాకినాడ జిల్లా ఉపాధి అధికారి శ్రీ జి. శ్రీనివాస్ మరియు కాకినాడ జిల్లా నైపుణ్య అధికారి శ్రీ ఎస్. గోపి క్రిష్ణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు...
Comments
Post a Comment