కాకినాడ జిల్లా రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షుడిగా రామకృష్ణ
కాకినాడ జిల్లా.... రైస్ మిల్లు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికయింది అధ్యక్షుడిగా రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కాకినాడలోని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో జరిగిన సమావేశంలో హాజరైన సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామకృష్ణ ఉపాధ్యక్షులుగా పేకేటి నాగేశ్వరరావు, కొయ్య శ్రీనుబాబు, సంయుక్త కార్యదర్శిగా కొత్త బైరవకృష్ణ, కోశాధికారిగా పెద్దిరెడ్డి రామాంజనేయ (బాబి)తో కూడిన కార్యవర్గాన్ని సుమారు 123 మంది సభ్యుల హాజరై ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షడు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థకు పంపిణీ చేసే బియ్యాన్ని జిల్లా నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక అవడం ఆనందంగా ఉందన్నారు. కాకినాడ పోర్టులో ఎటువంటి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందన్నారు. ఒకరిద్దరు చేస్తున్న తప్పుల వల్ల అసోసియేషన్లోని మిల్లర్ల పైన తప్పుడు సంకేతం వెళ్తుందన్నారు. పోర్టులో బొండం బియ్యం, పచ్చి నూకలు మాత్రమే మాత్రమే ఎగుమతి జరుగుతున్నాయని చెప్పారు. మిల్లర్ల సంక్షేమానికి తన వంతు ఎనలేని కృషి చేస్తానని రామకృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా రామకృష్ణను పలువురు మిల్లర్లు అభినందలు తెలిపి శాలువాలతో సత్కరించారు.

Comments
Post a Comment