తుమ్మల బాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

కాకినాడ జిల్లా.. జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వెయ్యి ద్విచక్ర వాహనాలతో పిఠాపురానికి జనశ్రేణి తరలివెళ్లారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ జనసేన నాయకులు, యువత, కార్యకర్తలు భారీ సంఖ్యలో పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరారు. సామర్లకోట పట్టణంలోని ప్రత్తిపాడు సెంటర్ వద్ద తుమ్మల రామస్వామి జెండా ఊపి బైక్ ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. అనంతరం జి. రాగంపేట, వడ్లమూరు, గోరింట, పులిమేరు, దివిలి గ్రామాల మీదుగా విరవ, విరవాడ గ్రామాల మీదుగా ర్యాలీ కొనసాగి పిఠాపురంలోని ఆర్ఆర్బీ హెచ్ఆర్ గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుంది. జనసేన జెండాలతో అలంకరించిన వాహనాలు, నినాదాలతో ర్యాలీ సాగడంతో మార్గమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా డిసిసిబి తుమ్మల రామస్వామి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద పండుగలా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో కూడా పార్టీ శ్రేణులు, యువత ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పిఠాపురంనియోజక వర్గంలో జనసేన పార్టీ యువజన విభాగ నిర్మాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు యువత ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కార్యకర్తలు చూపిస్తున్న ఉత్సాహం అభినందనీయమని అన్నారు. ఈ భారీ బైక్ ర్యాలీలో నాయకులు సరోజ వాసు, పోలమర శెట్టి సత్తిబాబు, పిట్టా జానకి రామారావు, మంచం సాయిబాబు, పెంకె వెంకటలక్ష్మి, పెద్దాపురం నియోజకవర్గంలోని జనసేన నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ