రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు పిఠాపురం ఆర్చర్స్ ఎంపిక
పిఠాపురం: రాజమహేంద్రవరంలో ఈనెల 6న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్చరీ పోటీల్లో పిఠాపురానికి చెందిన 10 మంది క్రీడాకారులు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జే. ఐశ్వర్య, బి. జైదీప్ స్వర్ణ పతకాలు సాధించగా, జే. అరుణ్, పి. లోకేష్ రజత పతకాలు సాధించారు. కే. హరిణి, లాస్య, యశస్విన్, తరుణ్, అమీదా, అలీ కాంస్య పతకాలు సాధించారు. వీరంతా జూనియర్ విభాగంలో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున పాల్గొననున్నారు. సీనియర్ విభాగంలో ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 4 నుంచి 7వ తేదీ వరకు భీమవరంలో జరగనున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొంటారని పిఠాపురం ఆర్చరీ కోచ్‌లు పి. కృష్ణ, లక్ష్మణరావు తెలిపారు.

Comments
Post a Comment