వాకలపూడి జడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా మణికంఠ స్వామి
కాకినాడ రూరల్, : కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కుండల మణికంఠ స్వామి ఎస్ఎంసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎన్నికల అధికారి, ఎంఈఓ-2 శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 280 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నికలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎంసీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎస్ఎంసీ సభ్యులుగా రామాల సూరిబాబు, వీర కుమారి, గోసాల కుమారి, గోసాల కాసు, బండి వసంతకుమారి, కొల్లుబోయిన సురేష్, కుమార్, భారతి, గోసాల చిన్నతల్లి, మండా దేవి, పక్కుర్తి శ్రీను, కొల్లుబోయిన అర్జున్, అమలదాసు దుర్గ, మాత లక్ష్మణరావు, పోలిశెట్టి సత్యనారాయణ, కోట సత్యవతి, బత్తుల సింహాచలం, గంటా భాస్కరరావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సభ్యులంతా కలిసి మణికంఠ స్వామిని ఎస్ఎంసీ చైర్మన్గా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్ మణికంఠ స్వామి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఎస్ఎంసీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరగడం సంతోషకరమని ఆయన అన్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తూ ఎస్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఎమ్మెల్యే పంతం నానాజీని గ్రామస్తులు అభినందించారు. జనసేన నాయకుడు సలాది శ్రీనివాస బాబు మాట్లాడుతూ మణికంఠ స్వామి గతంలో చైర్మన్గా పనిచేస్తూ పాఠశాలలోనే విద్యార్థులకు భోజనం వండించి అందించిన ఘనత సాధించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు మేరకు కూటమి సభ్యులు, జనసేన వీర మహిళలు, నాయకుల సహకారంతో మణికంఠ స్వామి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యకుమారి, పీటీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ దీనాలు తదితరులు పాల్గొని మాట్లాడారు.
Comments
Post a Comment