ప్రజల హృదయాల్లో వైయస్ ది చెరగని ముద్ర.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి
కాకినాడ జిల్లా. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన అందించిన పథకాలు, ఆత్మీయత రూపంలో ప్రజల మధ్య ఎప్పటికీ చిరస్థాయిగానే ఉంటారని,ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని వైఎస్ఆర్సిపి కాకినాడ సిటీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ వర్ధంతి సందర్భంగా స్థానిక బాలాజీ చెరువు సెంటర్లోని ఆయన కాంస్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి , పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజల గుండెల్లో వైయస్ సుస్థిర స్థానం సంపాదించారన్నారు. వైయస్ అమలు చేసిన పథకాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచాయని, ప్రపంచమంతా ఆయన పరిపాలన తీరును ఎంతగానో ప్రశంసించిందన్నారు. వైయస్ అడుగుజాడల్లో జాడల్లో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. వైయస్సార్ తో తనకు గల అనుబంధాన్ని ఆయన జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళదీప్తి, సిటీ మహిళా అధ్యక్షులు పసుపులేటి వెంకటలక్ష్మి, బీసీ సెల్ అధ్యక్షుడు వసుపల్లి కృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బళ్ల సూరిబాబు మైనారిటీ అధ్యక్షులు ఖాలీద్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు భాషా , జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు అల్లిరాజబాబు, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు మీసాల నికేష్ , మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ మాజీ కార్పొరేటర్లు కంపర బాబీ , సంగని నందం, కొరిమిల్లి బాలప్రసాద్, లంకె గోపి, చిట్నీడి నారాయణ మూర్తి, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments
Post a Comment