గంటల వ్యవధిలోనే మరణ ధ్రువీకరణ పత్రం అందజేత
కాకినాడ జిల్లా....సామర్లకోట పట్టణంలో ఒక వ్యక్తి మరణించిన గంటల వ్యవధిలోనే మరణ ధ్రువీకరణ పత్రాన్ని మున్సిపల్ అధికారులు అందజేశారు. పురపాలక సంఘము పరిధిలో మణుగలదిబ్బ సచివాలయం పరిధిలో అనసూరి రాజా రమేష్ తండ్రి అనసూరి అప్పారావు శనివారం స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న గంటల వ్యవధిలోనే మున్సిపల్ ఏఎస్ఓ హెల్త్ అసిస్టెంట్ లు ఆయన మృతిపై పరిశీలన జరిపి
గంటల వ్యవధిలోనే మరణ ధ్రువీకరణ పత్రం కుటుంభానికి అందజేశారు. పురపాలక ప్రజలకు సేవలు అందజేయడంలో ముందు ఉంటామని ఈ సందర్బంగా మున్సిపల్ కమీషనర్ నామ కనకరావు తెలిపారు.
Comments
Post a Comment