ఉల్లి షాపులు మూత.. కాకినాడ రైతు బజార్‌లో ఏం జరుగుతోంది?
కాకినాడ జిల్లా...కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రైతు బజార్‌లో ఉల్లి విక్రయాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకూ ఉల్లి ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్న వేళ.. రైతు బజార్‌లో ఉల్లి విక్రయించే షాపులు తెరవకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్టాక్ ఉన్నప్పటికీ ప్రజలకు ఉల్లి ఎందుకు అందడం లేదు? షాపులు ఎందుకు మూసి ఉన్నాయి? ఉల్లి ధర మరింత పెరుగుతుందనే ఆశతో కావాలనే విక్రయాలు నిలిపివేశారా? గత రెండు రోజులుగా ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉండాల్సిన రైతు బజార్‌లోనే ప్రజలకు ఉల్లి అందుబాటులో లేకపోవడం దేనికి సంకేతం? ప్రజలకు ఉల్లి అందించాల్సిన బాధ్యత ఎవరిది? స్టాక్ ఉన్నా అమ్మకాలు ఎందుకు జరగడం లేదు? షాపులు మూసి ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించలేదా? సామాన్యుడి వంటింట్లో ఉల్లి ధరల మంట మండుతుంటే.. కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ రైతు బజార్‌లో జరుగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు ఎప్పుడు నోరు విప్పుతారు? ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు?


Comments
Post a Comment