ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ చెత్త డంపింగ్...................‌ ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోని అధికారులు.. ప్రజా సమస్యల వేదికలో బాధితురాలి ఫిర్యాదు

కాకినాడ: తమ ప్రైవేట్ స్థలాన్ని చెత్త డంపింగ్‌ యార్డుగా మార్చేశారని కాకినాడకు చెందిన పులపర్తి రాజ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. కొవ్వూరు వెళ్లే మార్గంలోని మేడ్‌లైన్‌ సమీపంలో ఉన్న తమ రెండు ఎకరాల స్థలంలో కార్పొరేషన్‌ మరియు కొవ్వూరు పంచాయతీ అధికారులు కొన్నేళ్లుగా చెత్తను డంపింగ్‌ చేస్తున్నారని తెలిపారు. గతంలో తమ స్థలంలో రైస్‌మిల్‌ నిర్వహించేవారని ఆ తర్వాత కార్యకలాపాలు నిలిచిపోవడంతో అధికారులు చెత్తను వేస్తూ డంపింగ్‌ యార్డుగా మార్చేశారని వాపోయారు. ఈ సమస్యపై సుమారు ఐదేళ్లుగా పంచాయతీ అధికారులకు మరియు జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు అర్జీలు సమర్పించినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త తమది కాదంటూ కార్పొరేషన్‌ మరియు పంచాయతీ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కరించాలని కోరితే చెత్తను మీరే తొలగించుకోవాలని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. జనావాసాల మధ్య చెత్తను డంపింగ్‌ చేయడం వల్ల వెలువడుతున్న దుర్వాసనతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ చొరవ తీసుకుని తమ స్థలంలో డంపింగ్‌ చేసిన చెత్తను పూర్తిగా తొలగించి తమ స్థలాన్ని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రాజ్యశ్రీ కోరారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ