కుమారపురంలో రక్తదాన శిబిరం.. పవన్ కళ్యాణ్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జన సైనికులు
పిఠాపురం :: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని కుమారపురం గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికులు ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ అభయ బ్లడ్ సెంటర్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి గ్రామ యువత, జనసైనికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమాజానికి సేవ చేయాలనే ఆయన ఆలోచనలు, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపుతున్న చొరవ తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ముఖ్య అతిథులుగా పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్‌తో పాటు అతిథులుగా నియోజకవర్గ జనసేన నాయకులు వెన్న జగదీష్, వుటా నానిబాబు, తోలేటి శిరీష, పెంకె జగదీష్, జి గోవిందరాజు తదితరులు హాజరయ్యారు. గ్రామానికి చెందిన జనసేన నాయకులు నాళం నరేష్, తాటికాయల ప్రసాద్, బావిశెట్టి రామకృష్ణ, నాగిశెట్టి గంగారావు, నక్క సత్తిరాజు, సాధనాల రాజా, తాటికాయల మణికంఠ, యాతం వేణు, వేమగిరి ధర్మరాజు, గరగ వీరబాబు, తాటికాయల శ్రీనివాసు, నెక్కల సత్యనారాయణ, నెక్కల చిన్నబ్బాయి, నల్ల రాంబాబు, బావిశెట్టి శీను తదితరులతో పాటు జనసైనికులు, కార్యకర్తలు, గ్రామ యువత పాల్గొన్నారు. |



Comments
Post a Comment