మహిళల స్వయం ఉపాధికి ఇదేనా ప్రోత్సాహం? — అన్నవరం కొండపై మహిళా వ్యాపారికి అడ్డంకులు... - కలెక్టర్‌కు ఫిర్యాదు

కాకినాడ (అన్నవరం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎన్నో పథకాలు, తోడ్పాటు అందిస్తుంటే.. క్షేత్రస్థాయిలో ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్న ఒక మహిళకు మాత్రం తీవ్ర వేధింపులు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. కాకినాడ జిల్లా ప్రసిద్ధ అన్నవరం దేవస్థానం పడమట రాజగోపురం సమీపంలో షాప్ నిర్వహిస్తున్న సౌజన్య అనే మహిళా వ్యాపారిపై పక్క షాపుల నిర్వాహకులు సాగిస్తున్న గూండాగిరీ, దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దేవస్థానం నిబంధనల ప్రకారం కొండపై ఆరు కొబ్బరికాయలు, ఆరు అరటిపండ్ల కాంబోను రూ.180 కే అమ్మాల్సి ఉండగా, పక్క షాపుల వారు ఏకంగా గత కొన్ని ఏళ్లుగా రూ.350 చొప్పున భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అక్రమాలను ప్రశ్నిస్తూ నిబంధనల ప్రకారమే విక్రయాలు జరుపుతున్న సౌజన్య షాపునకు భక్తులెవరూ వెళ్లకుండా పక్క షాపు వాడు తీవ్ర దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వాపోయారు. తన దుకాణాన్ని ముందుకు జరిపి, రోడ్డుపై మనుషులను నిలబెట్టి భక్తులను దారికాచి పక్క షాప్ వైపు రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన షాప్ వద్ద చెట్టు అడ్డుగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని రోడ్డును ఆక్రమించి మరీ తన ఉపాధి దెబ్బతీస్తున్నారని చెప్పారు.
"దేవస్థానం అధికారులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం దారుణం. మహిళలు స్వయం ఉపాధితో ముందుకు వస్తుంటే ప్రోత్సహించాల్సింది పోయి ఇలా ఇబ్బందులకు గురిచేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? నిబంధనలు అందరికీ సమానంగా వర్తించవా?" అని ఆమె కలెక్టర్ వద్ద నిలదీశారు. ఈ దోపిడీ దందా, దౌర్జన్యాలపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని, నిబంధనలు అతిక్రమిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని, మహిళా వ్యాపారికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ