ఏకగ్రీవంగా పవర్ డిప్లొమా ఇంజినీర్స్ నూతన కార్యవర్గం

కాకినాడ జిల్లా : కాకినాడ సర్కిల్ ఏపీ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని ఐఎంఏ హాల్‌లో నిర్వహించిన సర్కిల్ జనరల్ బాడీ సమావేశంలో జరిగాయి. 2027 నుంచి 2028 పదవీకాలానికి జరిగిన ఈ ఎన్నికలకు ఎ వీరభద్రరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి జనరల్ పి సన్యాసిరావు డిస్కామ్ యూనిట్ జనరల్ సెక్రటరీ జి జోగి నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ సర్కిల్ యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్కిల్ అధ్యక్షులుగా ఎ వీరభద్రరావు కాకినాడ అర్బన్ ఏడీఈఓగా సర్కిల్ కార్యదర్శిగా గౌతు రాజు రామనయ్యపేట ఏఈగా సర్కిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం శ్రీనివాస్ యు కొత్తపల్లి ఏఈఓగా మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చ వాసవి ఇంద్రపాలెం జేఈగా సర్కిల్ కోశాధికారిగా వి సుబ్బారావు శాంతినగర్ జేఈఓగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జివిఎల్ఎన్ శ్రీనివాస్ ఈఈ ఎన్ ఉదయ్ భాస్కర్ సూపరింటెండెంట్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఈఈ శ్రీనివాస్‌ను పూలమాలతో ఘనంగా సత్కరించారు. నూతన కార్యవర్గం ఉద్యోగుల సంక్షేమంతో పాటు సంస్థ అభివృద్ధికి సమర్థవంతంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ