ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా 43 మంది పోలీసులకు ఘన సన్మానం

కాకినాడ జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, వారిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) నాయకులు కొనియాడారు. అంతర్జాతీయ ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని MPJ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్‌లో ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ ఎం. కిషోర్ కుమార్, డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ బి.వి. శ్రీహరి రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాకినాడ పరిధిలోని 15 పోలీసు స్టేషన్ల నుంచి విధి నిర్వహణలో విశేష ప్రతిభ, అంకితభావం కనబరిచిన 43 మంది పోలీసు సిబ్బందిని ఎంపిక చేసి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.సన్మానం పొందిన వారిలో 13 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు (CIలు), 10 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు (SIలు), 5 మంది అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ASIలు), 15 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.
ఈ సందర్భంగా MPJ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ హలీమ్, రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ సభ్యుడు హుస్సేన్, టౌన్ ప్రెసిడెంట్ షబ్బీర్ జానీ మాట్లాడుతూ సమాజ శాంతిభద్రతల్లో పోలీసుల పాత్ర ఎనలేనిదని వివరించారు. ఒక స్వచ్ఛంద సంస్థ ఇంత పెద్ద ఎత్తున తమ సిబ్బందిని గుర్తించి గౌరవించడం పట్ల పోలీసు ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతినిధులు, పోలీసు శాఖకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ