కాకినాడ మెడికవర్ లో నూతన క్యాన్సర్ వింగ్ ప్రారంభం
కాకినాడలో క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ నూతన క్యాన్సర్ వింగ్‌ను ఘనంగా ప్రారంభించింది. పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ముఖ్య అతిథిగా హాజరై నూతన క్యాన్సర్ వింగ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మాట్లాడుతూ కాకినాడలో ఆధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మెడికవర్ హాస్పిటల్స్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమానికి లయన్ చిట్నీడి శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ గవర్నర్, జనసేన పార్టీ నాయకుడు దుగ్గన బాబ్జీ తదితరులు హాజరయ్యారు. నూతన క్యాన్సర్ వింగ్‌ను సందర్శించిన వారు ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు.
మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ ఎన్. అంజిబాబు మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణ నుంచి చికిత్స వరకు అవసరమైన సమగ్ర వైద్య సేవలను ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో నూతన క్యాన్సర్ వింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిపుణులైన వైద్యుల సమన్వయంతో రోగులకు చికిత్స అందించనున్నట్లు చెప్పారు.క్యాన్సర్ చికిత్సలో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాల సమన్వయం కీలకమని వైద్యులు తెలిపారు. రోగి క్యాన్సర్ రకం, దశను బట్టి చికిత్సను ప్రణాళిక చేయడంతో పాటు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ ఆంకాలజిస్ట్ డా. మురళీధర్ మాట్లాడుతూ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించి సకాలంలో తగిన చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. కాకినాడలో సమగ్ర క్యాన్సర్ సేవలు అందుబాటులోకి రావడం ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరమన్నారు.రేడియేషన్ ఆంకాలజిస్టులు డా. పృధ్వీ రాజ్, డా. ప్రదీప్ భాస్కర్ మాట్లాడుతూ ఆధునిక రేడియేషన్ థెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించవచ్చని తెలిపారు. రోగి క్యాన్సర్ రకం, దశను బట్టి రేడియేషన్ చికిత్సను ప్రణాళిక చేస్తామని చెప్పారు. సర్జికల్ ఆంకాలజిస్టులు డా. సమంత్ కుమార్, డా. శివ భరత్ మాట్లాడుతూ అవసరమైన సందర్భాల్లో క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Comments
Post a Comment