డ్రగ్స్ వద్దు బ్రో.. విద్యార్థులకు అవగాహన
పిఠాపురం : ఆర్.ఆర్.బి.హెచ్. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డి.ఆర్.కె. రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. గంజాయి, మత్తు పదార్థాలు, ఇతర మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు తమ దృష్టికి వస్తే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదం చేయించారు. కార్యక్రమంలో ఈగల్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Post a Comment