ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ సానా, ఎమ్మెల్యే పంతం

కరప మండలం : కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం విజయరాయుడుపాలెం గ్రామంలో ముంపునకు గురైన పంట పొలాలను కాకినాడ ఎంపీ సాన సతీష్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శనివారం పరిశీలించారు. గత నాలుగు రోజులుగా ముంపునీటిలోనే ఉన్న వరి దుబ్బులను రైతులు వారికి చూపించి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా రైతు ముద్రగడ గోవిందరాజులు మాట్లాడుతూ రొయ్యల చెరువుల కారణంగా ఈ ప్రాంతంలో ముంపు సమస్య ఏర్పడుతోందని తెలిపారు. వెంటనే మురుగు నీటి డ్రైనేజీలను శుభ్రం చేసి, ముంపునీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం వేములవాడ సిరిగిరిపల్లి లంకలో నూతనంగా నిర్మించిన రహదారులను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎమ్మెల్యే నానాజీ సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, దశలవారీగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జే. శ్రీనివాస్, తహసీల్దార్ ఆకుల లక్ష్మీ సరస్వతి, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, ఏళ్ల పండు, బండారు మురళి, మీసాల రాంబాబు, ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పింకీ శ్రీనివాస్ బాబా, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీల తదితరులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ