ఫిజియోథెరపీతో ఆరోగ్యకరమైన జీవనశైలి...మెడ్‌వే సంజీవి ఆసుపత్రిలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం
కాకినాడ...ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడ్‌వే సంజీవి ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు తెలిపారు. యూనిట్ హెడ్ ఆర్. దినేష్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శారీరక చలనం, వ్యాయామం, పునరావాస చికిత్స ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించడంతో పాటు జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని వివరించారు. ‘‘జీవితానికి చలనం – అందరికీ ఆరోగ్యం’’ అనే సందేశంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని ఆసుపత్రి సిబ్బంది విజయవంతంగా నిర్వహించారు.

Comments
Post a Comment