కొవ్వాడ ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తాం. – కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ
కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్: తాగునీటి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. గుడారిగుంటలోని తన నివాసం వద్ద మంచినీటి ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ.. కొవ్వాడ గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ మంచినీటి ట్యాంకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో కొవ్వాడ గ్రామ ప్రజలకు సైతం తాగునీటిని అందించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల జీవన్ మిషన్ ద్వారా సుమారు రూ.1,600 కోట్లతో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టామని నానాజీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డిపల్లి కిషోర్, వీరబాబుతో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment