ఆపదలో ఉన్న కుటుంబానికి లిటిల్ స్టార్స్ ట్రస్ట్ చేయూత

పిఠాపురం : పిఠాపురం మంగయమ్మరావు పేటలో ఇటీవల అనారోగ్యంతో భర్తను కోల్పోయి, కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక కుటుంబానికి లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆపదలో అండగా నిలిచారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి కొంతమేర ఆర్థిక, ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ టి.కామేశ్వర్రావు తెలిపారు.ఈ సేవా కార్యక్రమానికి మండపేటకు చెందిన యమ్. జ్యోతి మరియు వారి స్నేహితులు సహకరించారు. తమ వంతు సహాయాన్ని అందించి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన వారికి లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఆపదలో ఉన్న కుటుంబాలకు అవసరమైన సమయంలో సహాయం అందించడం ద్వారా వారిలో ధైర్యం, భరోసా కల్పించడమే తమ సేవా సంస్థ లక్ష్యమని ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. సమాజంలోని దాతలు, సేవాభిమానులు ముందుకు వచ్చి ఇలాంటి కుటుంబాలకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.“మీ సహాయం ఒక కుటుంబానికి భరోసా...
మీ చేయూత ఒక జీవితానికి ఆశ” అనే సందేశంతో ట్రస్ట్ నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ