ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ
పిఠాపురం : ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డాక్టర్ జ్యోతుల రాంబాబు గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సమయానికి కళాశాలకు హాజరవుతున్నారా అనే అంశాన్ని పరిశీలించడంతో పాటు కళాశాల పరిశుభ్రత, తరగతి గదులను తనిఖీ చేశారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పిఠాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగేలా కృషి చేస్తానని డాక్టర్ జ్యోతుల రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డి.ఆర్.కె. రెడ్డి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.


Comments
Post a Comment