నిత్యవసర సరుకులు పంపిణీ

కాకినాడ రూరల్ర: మణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో బొల్లోజు శ్రీనివాస్ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధ రాజు సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకుని నిస్వార్ధంగా సేవ చేయడం, దయ చూపడమే మానవత్వం అని అన్నారు .ఎవరికి సేవ చేసినా దేవునికి సేవ చేసినట్లుగా భావించాలన్నారు. ఆ దిశగా బొల్లోజు శ్రీనివాస్ ప్రతినెల పేదలకు సహాయం చేయడం అభినందనీయమని సత్యనారాయణ రాజు తెలిపారు . ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, శ్రీవాణి, నిమ్మకాయల వెంకటేశ్వరరావు , రాజా, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...