కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ లో నూతన హై డిపెండెన్సీ యూనిట్ ప్రారంభం

కాకినాడ: మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన హై డిపెండెన్సీ యూనిట్ (HDU) ను నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, ఆధునిక వైద్య సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో మరియు క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు హై డిపెండెన్సీ యూనిట్ ఎంతో ఉపయోగపడుతుందని, అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బందితో ఈ హై డిపెండెన్సీ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్, కాకినాడ సెంటర్ హెడ్ నందికోళ్ళ అంజిబాబు మాట్లాడుతూ,పెద్దాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా, అలాగే కోనసీమ జిల్లాల్లోని అనేక మంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు మరియు శస్త్రచికిత్సల అవసరాల సమయంలో తన సొంత డబ్బులతో వైద్య సహాయం అందించిన వ్యక్తి నిమ్మకాయల చినరాజప్ప అని తెలిపారు. కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో హై డిపెండెన్సీ యూనిట్ (HDU)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు నిరంతర పర్యవేక్షణ, అత్యవసర వైద్య సేవలు మరియు మెరుగైన చికిత్స అందించేలా ఈ యూనిట్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ