వీరుడి విగ్రహం దుస్థితి.. ఏడాదిగా పట్టించుకోని అధికారులు

కాకినాడ : బ్రిటిష్ వాళ్ల గుండెల్లో గడగడలాడించిన మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకు స్థానికంగా దక్కుతున్న గౌరవం ఇదేనా అంటూ ప్రజలు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆ విప్లవవీరుడి విగ్రహం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై ఎవరి కంట పడకుండా మూలకు చేరింది.కాకినాడ రూరల్ మండలం తూరంగి బొట్టు చెరువు వద్ద ప్రధాన గేటు పక్కన అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉండేది. అయితే, ఆ ప్రాంతంలో ప్రహరీ గోడ నిర్మాణ పనుల నిమిత్తం ఈ విగ్రహాన్ని తొలగించి, పక్కనే చెరువు వద్ద ఉంచారు. నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12 నెలల (ఒక ఏడాది) గడుస్తున్నా ఈ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించే దిశగా ఎవరూ దృష్టి పెట్టకపోవడం అత్యంత దురదృష్టకరమని స్థానికులు మండిపడుతున్నారు.ఈ బొట్టు చెరువు చుట్టూ రోజూ వందలాది మంది వాకర్స్, స్థానికులు వ్యాయామం మరియు నడక కోసం వస్తుంటారు.దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుని విగ్రహం ఇలా నెలల తరబడి చెరువు ఒడ్డున అనాథలా పడి ఉండటాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.తొలగించిన స్థానంలోనే లేదా అదే ప్రాంతంలో గౌరవప్రదంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని యథావిధిగా తిరిగి ప్రతిష్టించాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...