నేర రాజకీయాలను వైసిపి ప్రోత్సహిస్తుంది రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆరోపణ

కాకినాడ రూరల్:  కాకినాడ రూరల్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. 'రావణ్' పేరుతో సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లను, హిందూ ధర్మాన్ని అవమానిస్తూ కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తికి వైఎస్సార్‌సీపీ నాయకత్వం పరోక్షంగా మద్దతు ఇస్తోందని, దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆరోపించారు. రాష్ట్రంలో నేర రాజకీయాలకు వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రోత్సాహం లభించిందని, సమాజాన్ని విభజించే శక్తులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వలసపాకల గంగరాజు నగర్‌లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ రెండో అధ్యాయం ప్రారంభమైందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మంది నాయకులు పార్టీలో చేరనున్నారని తెలిపారు. ప్రజల్లో మార్పు కోసం ఎదురుచూస్తున్న అనేక మంది జనసేన వైపు వస్తున్నారని పేర్కొన్నారు.
'రావణ్' పేరుతో సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లు, హిందూ ధర్మాన్ని అవమానిస్తూ కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తికి వైఎస్సార్‌సీపీ నాయకత్వం పరోక్షంగా అండగా నిలుస్తోందని ఆరోపించారు. దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా ఉందని పేర్కొంటూ, ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం రాష్ట్రానికి ప్రమాదకరమని అన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో నేరాలకు రాజకీయ రక్షణ లభించిందని, క్రైమ్‌ను లీగలైజ్ చేసినట్టుగా పరిస్థితులు మారిపోయాయని నానాజీ విమర్శించారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న కాకినాడలో ఇప్పుడు రాత్రిపూట గన్‌లతో గస్తీ తిరగాల్సిన పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. ప్రజల్లో భయాందోళనలు పెరిగేలా గత పాలన సాగిందని ఆరోపించారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేరాలకు పాల్పడే వారిని, సమాజంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని చట్టపరంగా కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు.
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైఎస్సార్‌సీపీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చేసిన వ్యాఖ్యలపై కూడా నానాజీ స్పందించారు. పార్టీ గుర్తుపై పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయంతోనే అలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ అనంతలక్ష్మి తాటికాయల వీరబాబు కరెడ్ల గోవిందు, బండారు మురళి, పుల్ల శ్రీరాములు, పాండ్రంకి రాజు, సంతోష్ కుమార్, గోవింద్ వీర మహిళలు ఉన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...