వారాహి ఆలయ ఘటనపై ఈవో శ్రీనివాస్ స్పందన.. ప్రచారంలో నిజం లేదన్న వివరణ

కాకినాడ రూరల్ : కొవ్వూరు శ్రీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద మహిళలతో దేవాదాయ శాఖ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని ఆలయ ఈవో శ్రీనివాస్ ఖండించారు. భక్తుల రద్దీని నియంత్రించే సమయంలో జరిగిన ఘటనను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. గుప్త నవరాత్రుల సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో క్యూలైన్లను క్రమబద్ధీకరించే క్రమంలో జరిగిన చర్య మాత్రమేనని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆ సమయంలో పోలీసులు, సేవా సంఘాల ప్రతినిధులు కూడా విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ గుప్త నవరాత్రులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు. జూలై 15న ప్రారంభమైన వారాహి గుప్త నవరాత్రులు జూలై 25తో ముగియనున్నాయని వెల్లడించారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...