ముగిసిన కొవ్వూరు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు

కాకినాడ : దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోని కొవ్వూరు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు శుక్రవారం ముగిశాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.శుక్రవారం కావడంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని దర్శనం చేసుకున్నారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చండీహోమం నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి సిహెచ్. శ్రీనివాస్ పూర్ణాహుతి సమర్పించారు.అమ్మవారికి ప్రీతిపాత్రమైన గుప్త నవరాత్రులు గురువారం రాత్రి ముగిశాయని తెలిపారు. ఆలయ సిబ్బంది ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదవితరణ గావించారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...