భవితరాల కోసం 10 వేల సీడ్ బాల్స్.. చేయూత చారిటబుల్ సొసైటీ వినూత్న పర్యావరణ ఉద్యమం
కాకినాడ: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా అటవీ శాఖాధికారి (DFO) ఎన్. రామచంద్రరావు పిలుపునిచ్చారు. చెట్లు నాటడం అంటే భూమికి ప్రాణం పోయడం ఒక సీడ్ బాల్ తయారు చేయడం అంటే భవిష్యత్తుకు ఆశను నాటడం అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సుమారు 10,000 సీడ్ బాల్స్ ప్రిపరేషన్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చేయూత రవి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం తాము చేపట్టిన ఈ ఉద్యమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ మెరుగైన పచ్చటి వాతావరణం అందించడమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా వ్యవహరించాలని అన్నారు. ఈ సీడ్ బాల్స్ నిపుణుల పరిరక్షణలో అత్యంత శాస్త్రీయ పద్ధతిలో సిద్ధం చేసామని ఈ తయారైన విత్తన బంతులను డ్రోన్లు మరియు ఇతర సులభతర మార్గాల ద్వారా వివిధ ప్రాంతాలలో ఖాళీ స్థలాల్లో అటవీ ప్రాంతాలు కొండ ప్రాంతాలు మరియు కోస్టల్ తీర ప్రాంతాల ఏరియాలో వెదజల్లడానికి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల రెండో తారీకు స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిర్వహించినట్లు తెలిపారు.కాకినాడ నగరంలోని స్థానిక చేయూత భవన్‌లో చేయూత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 'సీడ్ బాల్స్' (విత్తన బంతులు) ప్రిపరేషన్ డ్రైవ్ నిర్వహించారు. చేయూత చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు ఎం. రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, డిఎఫ్‌ఓ ఎన్. రామచంద్రరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ డ్రైవ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున చెట్లను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చేయూత చారిటబుల్ సొసైటీ ముందుకు వచ్చి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ మెరుగైన పచ్చటి వాతావరణం అందించడమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల రెండో తారీకు స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయూత చారిటబుల్ సొసైటీ సభ్యులు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Comments
Post a Comment