అతి తక్కువ సమయంలో తప్పుపోయిన బాలుడిని గుర్తించిన టూ టౌన్ పోలీస్

 కాకినాడ జిల్లా : కాకినాడ కుళాయి చెరువు వద్ద ఉన్న భాను అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఆండ్రి ప్రసాద్ గారి భార్య శిరీష డెలివరీకి పుట్టింటికి వెళ్ళినట్లు, అతని 5 సం. ల పెద్ద కుమారుడు వికేత్ జోయ్ ఆశ్రమ పబ్లిక్ స్కూల్లో UKG చదువుచున్నట్లు, ది.07-07-2026 తేదీన బాలుడు స్కూల్ నుండి వచ్చిన తరువాత బాలుడుకి ఇంట్లో TV పెట్టి తండ్రి పని మీద బయటకు వెళ్ళినట్లు, ఇంట్లో TV చూస్తున్న బాలుడు రాత్రి సుమారు 7.45 గం.ల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లిపోయినట్లు, రాత్రి సుమారు 8 గం.లకు బాలుడి తండ్రి వచ్చి చూసుకుని వెంటనే కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా 2 టౌన్ ఇన్స్పెక్టర్ M.అప్పలనాయుడు గారు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 40 ని.లలోనే తప్పిపోయిన బాలుడిని ట్రేస్ చేసి తండ్రికి అప్పగించినారు. పిర్యాదు చేసిన వెంటనే స్పందించి తప్పిపోయిన బాలుడిని వెదికి పట్టుకుని అప్పగించినందుకు గాను అబ్బాయి కుటుంబ సభ్యులు 2 టౌన్ ఇన్స్పెక్టర్ M.అప్పలనాయుడు గారికి, కాకినాడ జిల్లా SP గారికి మరియు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసినారు. 2 టౌన్ ఇన్స్పెక్టర్ M.అప్పలనాయుడు గారిని వారి సిబ్బందిని కాకినాడ జిల్లా SP శ్రీ G.బిందు మాధవ్ IPS గారు, ASP శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ IPS గారు అభినందించినారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...