కాకినాడ రూరల్ వైసీపీ బూత్ కమిటీల ఉపాధ్యక్షుడిగా వెల్లంకి రమేష్ నియామకం
కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కాకినాడ రూరల్ మండల బూత్ కమిటీల విభాగం ఉపాధ్యక్షుడిగా వెల్లంకి రమేష్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది.ఈ మేరకు పార్టీ అధికారిక గుర్తింపు కార్డును విడుదల చేసింది. బూత్ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం, కార్యకర్తల సమన్వయం,పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి బాధ్యతలను ఆయననిర్వర్తించనున్నారు. నియామకంపై స్పందించిన వెల్లంకి రమేష్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.గ్రామాలు,వార్డులు,బూత్ కమిటీల మధ్య సమన్వయాన్ని పెంచుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.ఈ అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, జిల్లా పార్టీనాయకత్వం, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మండల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటూ వారితో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.వెల్లంకి రమేష్ నియామకాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు.నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Comments
Post a Comment