వికాస ఆధ్వర్యంలో మరో 50 మందికి ఉపాధి..కలెక్టర్‌ను కలిసిన ఎంపికైన అభ్యర్థులు

కాకినాడ
: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమంలో భాగంగా వికాస ఆధ్వర్యంలో బెంగళూరులోని ఫాక్స్‌కాన్ కంపెనీలో మొబైల్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన 50 మంది అభ్యర్థులు సోమవారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌ నుంచి ప్రత్యేక బస్సులో అభ్యర్థులను కంపెనీకి పంపించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్వో తిప్పే నాయక్ దేశావత్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. లచ్చారావును అభినందించారు.
వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. లచ్చారావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఫాక్స్‌కాన్ కంపెనీలో సుమారు 500 మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.19 వేల వేతనంతో పాటు ఉచిత భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వికాస సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వికాస మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...