రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో పిఠాపురం క్రీడాకారుల సత్తా

 

పిఠాపురం: మండపేటలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో పిఠాపురం క్రీడాకారులు ప్రతిభ చాటుతూ మొత్తం 11 పతకాలు సాధించారు. పిఠాపురానికి చెందిన కోచ్ పి. లక్ష్మణరావు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు 8 స్వర్ణ, 2 రజత, 1 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారని ఆయన తెలిపారు. స్వర్ణ పతకాలు సాధించిన వారిలో సి.హెచ్. ప్రణయ్, ఎస్. హర్ష, ఎం. సాయి తేజ, జె. దర్శన్ గిరీష్, ఎస్. జోష్ వెస్లీ, ఎం. జాస్విక, పి. హంసిక, ఎం. రీత్విక ఉన్నారు. కె. జోయల్, పి. శ్యామ్ రజత పతకాలు సాధించగా, జె. సూర్య గౌతమ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. విజేతలను కోచ్ పి. లక్ష్మణరావు అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...