ఫ్లెక్సీ రహిత కాకినాడే లక్ష్యం.. ప్రజల సహకారంతోనే సాధ్యం: కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ

కాకినాడ : ఫ్లెక్సీ రహిత కాకినాడ నిర్మాణమే లక్ష్యంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణారావు అధ్యక్షతన సర్పవరం జంక్షన్ నుంచి భానుగుడి జంక్షన్ వరకు జరిగిన ఈ ర్యాలీలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం భానుగుడి సెంటర్‌లో మానవహారం నిర్వహించి, "ఫ్లెక్సీ రహిత కాకినాడ మన లక్ష్యం", "పర్యావరణ పరిరక్షణకు అందరం సహకరిద్దాం" అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేస్తేనే ఫ్లెక్సీ రహిత కాకినాడను నిర్మించగలమని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా 200 మైక్రాన్లకు పైబడిన అనుమతితో కూడిన ఫ్లెక్సీలను మాత్రమే ఏర్పాటు చేయాలని, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్లెక్సీ నిషేధాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు.నగరంలో వీధి దీపాల వెలుగుదలపై వస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తూ, ఆటోమేటిక్ మీటర్ల వ్యవస్థ కారణంగా సహజ కాంతి తగ్గిన తర్వాతే కొన్ని లైట్లు వెలుగుతున్నాయని, సమస్య ఉన్న ప్రాంతాల్లో పరికరాల మార్పిడి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు.తాగునీటి సరఫరా సజావుగా కొనసాగుతోందని, అన్నా క్యాంటీన్ సమీపంలోని రోడ్డు సమస్య, నీటి లీకేజీ, పనిచేయని టీవీ వంటి అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు చేపట్టినట్లు చెప్పారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేలా విద్యుత్ శాఖను కోరినట్లు వెల్లడించారు.ప్లాస్టిక్, ఫ్లెక్సీ వ్యర్థాలను రోడ్లపై వేయకుండా డస్ట్‌బిన్‌లలో వేయాలని, పరిశుభ్రమైన, పర్యావరణ హితమైన కాకినాడ నిర్మాణానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు.



Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...