ఘనంగా ముగిసిన హ్యాండ్ బాల్ పోటీ
పెద్దాపురం..... పి ఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, పెద్దాపురంలో 24-07-2026 న హ్యాండ్ బాల్ రీజినల్ లెవెల్ పోటీ ఫైనల్స్ చాలా ఉత్సాహభరితంగా జరిగాయి అని విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీ యస్. సరత్చంద్ర కీర్తి గారు తెలియజేశారు. గత రెండు రోజులుగా 60 లీగ్ మ్యాచ్లు నిర్వహించారు. అందులో కోలార్, రాయచూరు, కరీంనగర్, పోలవరం, పాండిచ్చేరి, చిక్మంగళూరు,అల్లపి క్లస్టర్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నారు. 24-07-26 న జరిగిన ఫైనల్లో విన్నర్స్ అండర్ 14 మరియు 17; బాలురు విభాగంలో కోలార్ క్లస్టర్ , అండర్ 19 లో కరీంనగర్ క్లస్టర్ స్థానాన్ని కైవసం చేసుకోగా అండర్ 14 మరియు 17 బాలురు విభాగంలో పోలవరం క్లస్టర్, అండర్ 19 లో రాయచూరు క్లస్టరు రన్నర్స్ గా నిలిచారు. అండర్ 14 మరియు 17 బాలికలు విభాగంలో కోలార్ క్లస్టర్, అండర్ 19 లో పుదిచ్చెరి విన్నర్స్ స్థానాన్ని గెలుచుకున్నారు. అండర్ 19 మరియు 17 బాలికలు విభాగంలో చిక్మంగళూరు క్లస్టర్, అండర్ 14 లో అల్లపి క్లస్టర్స్ రన్నర్స్ గా నెగ్గారు అని పి యి టి సి హెచ్ జనార్దన్ నాయుడు తెలియజేశారు. ఈ పోటీలలో గెలుపొందిన టీమ్స్ నేషనల్ లెవెల్ లో ఆడేందుకు జలంధర్, పంజాబ్ ఆగస్టు 28 తేదీన జవహర్ నవోదయ విద్యాలయ, పెద్దాపురం ఆధ్వర్యంలో హైదరాబాద్ రీజియన్ తరపున వెళ్ళిపోతున్నారు అని విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీ శరత్చంద్ర కీర్తి గారు తెలియజేసారు. ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ లలిత రైస్ ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ హాజరరవగా గెస్ట్ ఆఫ్ హానర్ గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ గారు హాజరై రి. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు బహూకరణ, అతిథులకు సత్కారాలు మరియు ఇతర కార్యక్రమాలతో ఆద్యంతం ఉత్సాహ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి శ్రీ సనపల సత్యన్నారాయణ పీ జి టి ఇంగ్లీష్, మేథ్స్ పిజిటి చక్రవర్తి, పి యి టి శ్రీ మతి అనూరాధ, పి. రామారావు పి జి టి హిందీ, శ్రీ మతి ప్రేమలత, శ్రీ మతి రాజ్యలక్ష్మి, ఎమ్ లక్ష్మణరావు, కె విజయకుమార్, కె రామచంద్రుడు, శ్రీ మతి బి శార్వాణి , మారుతి తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment